Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు..!
Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఐఫోన్ 15పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Amazon Freedom Sale
Amazon Freedom Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ జూలై 31న భారత మార్కెట్లో ప్రారంభం కానుంది. వివిధ కేటగిరీలో (Amazon Freedom Sale) అనేక డిస్కౌంట్లను అందిస్తుంది. అంతకన్నా ముందే అమెజాన్ ఐఫోన్ 15పై స్పెషల్ డీల్‌ను ప్రకటించింది.
కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా పొందవచ్చు. 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద A16 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంది. 48MP వైడ్-యాంగిల్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింపు :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 128GB వేరియంట్ రూ. 58,249 (బ్యాంక్ ఆఫర్లతో)కు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 61,400 వద్ద లిస్ట్ అయింది. ఈ ఐఫోన్ ధర రూ. 79,900కు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడింగ్ చేసేటప్పుడు కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 47,150 వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పే-ఆధారిత డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
ఐఫోన్ 15 మోడల్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్ ధరలు ప్రస్తుతం వరుసగా రూ. 70,800, రూ. 82,900గా ఉన్నాయి. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో 256GB, 512GB స్టోరేజ్ మోడల్ ధరలు రూ. 79,900, రూ. 99,900గా అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, రోజ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో కూడా పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15తో పాటు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13R వంటి ఇతర స్మార్ట్‌ఫోన్లు కూడా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సందర్భంగా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
భారత మార్కెట్లో అమెజాన్ సేల్ జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. వివిధ కేటగిరీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ప్రత్యేకించి అమెజాన్ ప్రైమ్ సభ్యులు రెగ్యులర్ యూజర్ల కన్నా 12 గంటల ముందుగానే యాక్సెస్ చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A16 బయోనిక్ చిప్ కలిగి ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 48MP వైడ్-యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. IP68 రేటింగ్, 12MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంది.