Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్.. ప్రైమ్ మెంబర్ల కోసం టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు..!

Amazon Freedom Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ మొదలైందోచ్.. ప్రైమ్ మెంబర్ల కోసం సేల్ ఏయే స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఎలా ఉన్నాయంటే?

Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్.. ప్రైమ్ మెంబర్ల కోసం టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు..!

Amazon Freedom Sale

Updated On : July 31, 2025 / 11:34 AM IST

Amazon Great Freedom Festival 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ ప్రైమ్ సభ్యుల (Amazon Freedom Sale) కోసం అందుబాటులో ఉంది. మీకు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే.. ఈ సేల్ మీకోసమే.. అమెజాన్ ఫ్రీడమ్ ముందుస్తు సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, ఐఫోన్ 15 వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

మిగతా వారందరికీ ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి రానుంది. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా లేదా కొత్త ఇయర్‌బడ్‌ కొనుగోలు చేయాలని అనుకున్నా ఈ సేల్‌ ద్వారా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సందర్భంగా తగ్గింపు ధరలకు లభించే స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలలో డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా కూడా ఉంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీని అందిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ.1,24,999 ధరకు లభ్యమవుతుంది.

Read Also : Amazon Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ప్రైమ్ సభ్యులకు జూలై 31 నుంచే..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో అమర్చి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 200MP మెయిన్ కెమెరా, 50MP 5x టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP 3x ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ.79,999 ధరకు లభ్యమవుతుంది.

ఆపిల్ ఐఫోన్ 15 :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 15లో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఐఫోన్ 15 కేవలం రూ. 58,249కు పొందవచ్చు.

వన్‌ప్లస్ 13R :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోల్డ్ ప్యానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో అమర్చి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13Rలో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. వన్‌ప్లస్ 13R ఫోన్ అమెజాన్‌లో రూ.36,999 ధరకు లభ్యమవుతుంది.