Amazon Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ప్రైమ్ సభ్యులకు జూలై 31 నుంచే..

Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Amazon Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ప్రైమ్ సభ్యులకు జూలై 31 నుంచే..

Amazon Freedom Sale

Updated On : July 30, 2025 / 8:41 PM IST

Amazon Great Freedom Festival Sale : ఆగస్టు 1న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు రేపు (జూలై 31) మధ్యాహ్నం 12 గంటల (Amazon Freedom Sale) నుంచి ముందస్తుగా యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ సేల్ సమయంలో అనేక స్మా్ర్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై అత్యంత తక్కువ ధరలకు పొందవచ్చు.

అదనంగా, ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ తగ్గింపును పొందవచ్చు. మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైనా అమెజాన్ ఇప్పటివరకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ జాబితాను అందిస్తోంది.

ఈ సేల్ సందర్భంగా ఆపిల్, శాంసంగ్, ఐక్యూ వంటి టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ 40శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ప్రీమియం ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు.

టాప్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే :
శాంసంగ్ కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 అల్ట్రా, కొత్త ఫోల్డబుల్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఉన్నాయి. మీరు హై-ఎండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తుంటే.. బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి బెస్ట్ శాంసంగ్ డీల్స్ వరకు ఫుల్ డిటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ. 1,34,999 నుంచి రూ.79,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ Z ఫోల్డ్ 6 : గెలాక్సీ Z ఫోల్డ్ 6 అసలు ధర రూ. 1,64,999 నుంచి రూ. 1,24,999 తగ్గింపు ధరకు లభిస్తుంది. మీరు ఫోల్డబుల్ ఫోన్ కోసం ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం కావచ్చు.
గెలాక్సీ M36 5G : శాంసంగ్ గెలాక్సీ M36 5G, బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 15,999కు సేల్ సమయంలో అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ M06 5G : శాంసంగ్ గెలాక్సీ M06 5G అసలు ధర రూ. 13,999 నుంచి రూ. 8,499కి అందుబాటులో ఉంటుంది.

Read Also : Flipkart Freedom Sale 2025 : ఆగస్టు 1 నుంచే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. 78 బ్లాక్ బస్టర్ డీల్స్, మరెన్నో బ్యాంకు ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు..

వన్‌ప్లస్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఇవే :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ల వరకు వన్‌ప్లస్ లైనప్ అంతటా అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. మీరు వన్‌ప్లస్ 13 కోసం చూస్తున్నారా? నార్డ్ సీఈ4 లైట్ 5G తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో బెస్ట్ వన్‌‌ప్లస్ డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశం.

వన్‌ప్లస్ 13 రూ. 62,999కు కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ 13R రూ. 42,999కు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లతో రూ. 36,999కు పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 5 : అమెజాన్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 5 ధర రూ. 31,999కు పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లతో ధర రూ. 29,999కి తగ్గవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE5 : భారీ 7100mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ CE5 అసలు ధర రూ. 24,999 నుంచి రూ.22,999కు బ్యాంక్ డిస్కౌంట్లు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5G సేల్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్లతో కేవలం రూ. 15,999కే లభిస్తుంది.

టాప్ ఐక్యూ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
ఐక్యూ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది.
ఐక్యూ 13 వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుంచి ఐక్యూ Z10 లైట్ వంటి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల వరకు డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
ఐక్యూ Z10R : ఐక్యూ Z10R బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 17,499కి లభిస్తుంది. అసలు ధర రూ. 23,499కు పొందవచ్చు.
ఐక్యూ నియో 10R : స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3-ఆధారిత ఫోన్ రూ. 31,999 నుంచి కేవలం రూ. 22,999కు పొందవచ్చు.
ఐక్యూ Z10x 5G : కేవలం రూ. 12,749 ధరకే లభిస్తుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్.
ఐక్యూ Z10 లైట్ : ఐక్యూ Z10 లైట్ సేల్ సమయంలో కేవలం రూ. 9,499కే ఉంటుంది.
ఐక్యూ 13 : ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ బ్యాంక్ డిస్కౌంట్‌లతో సహా రూ. 52,999కు కొనుగోలు చేయొచ్చు.
ఐక్యూ నియో 10 ఫోన్ రూ. 29,999 తగ్గింపు ధరకు పొందవచ్చు.

టాప్ రెడ్‌మి, షావోమీ డీల్స్ ఇవే :
కొత్త రెడ్‌మి లేదా షావోమీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే.. ఎంట్రీ-లెవల్ 5G ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కొనుగోలు చేయొచ్చు.
రెడ్‌మి 13 ప్రైమ్ (8GB+128GB) అసలు ధర రూ. 19,999 నుంచి రూ. 11,699కి తగ్గుతుంది.
రెడ్‌మి 13 5G : రూ. 17,999కిబదులుగా రూ.10,999కు పొందవచ్చు.
రెడ్‌మి A4 5G : రెడ్‌మి A4 5G ధర రూ. 10,999 నుంచి రూ.7,999కు తగ్గింది.
రెడ్‌మి 14C : ఈ సేల్ సమయంలో ధర రూ. 9,499కు పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 14 : రూ. 15,999కి కొనుగోలు చేయవచ్చు.
షావోమీ 14 సీవీ : ఈ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫోన్ ధర రూ. 28,749 ఉంటుంది.
షావోమీ 15 : ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్ రూ. 59,999కి అమ్మకానికి రానుంది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ల కోసం టాప్ ఆఫర్లు ఇవే :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రేంజ్‌లో అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు రియల్‌మి GT 7 ప్రో వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ చూస్తున్నారా? రియల్‌మి నార్జో 80X వంటి సరసమైన 5G ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ డీల్స్ అప్‌గ్రేడ్ బెస్ట్ రియల్‌మి ఆఫర్లు ఉంటుంది.

రియల్‌మి నార్జో 80 లైట్ : కేవలం రూ. 6,599 నుంచి అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి నార్జో 80 ప్రో : రూ. 19,999కు అమ్మకానికి వస్తుంది. మిడ్ రేంజ్ ధరలో లభిస్తుంది.
రియల్‌‌మి GT 7 ప్రో : ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ సమయంలో రూ. 44,999 ధరకు లభిస్తుంది.
రియల్‌మి GT 7, GT 7T, GT 7 ఫోన్లు రూ. 36,999కు పొందవచ్చు. రియల్‌మి GT 7T ధర రూ. 31,999
రియల్‌మి నార్జో 80X : రూ. 11,699కు అందబాటులో ఉంటుంది. బడ్జెట్ 5G కోరుకునేవారికి బెస్ట్ ఫోన్.

స్మార్ట్‌ఫోన్ డీల్స్ వివరాలివే :
ఐఫోన్ 15 అసలు ధర రూ. 69,900 నుంచి రూ. 58,249కు లభిస్తుంది. వివో X200 FE ఫోన్ రూ. 54,999, ఒప్పో రెనో14ప్రో రూ. 45వేల ధరకు లభించనున్నాయి. మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే వివో V50 రూ. 34,999కు పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 కూడా రూ. 25,862కు అమ్మకానికి ఉంటుంది. అయితే, నథింగ్ ఫోన్ 3a ఫోన్ రూ. 25,747కు అందుబాటులో ఉంటుంది. తక్కువ బడ్జెట్ వినియోగదారులకు లావా బోల్డ్ N1 ప్రో బెస్ట్ ఫోన్. కేవలం రూ. 6,029కు అమ్మకానికి వస్తుంది.