Flipkart Freedom Sale 2025 : ఆగస్టు 1 నుంచే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. 78 బ్లాక్ బస్టర్ డీల్స్, మరెన్నో బ్యాంకు ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు..

Flipkart Freedom Sale 2025 : ఆగస్టులో వార్షిక ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ధృవీకరించింది. ఆఫర్లు, డిస్కౌంట్లకు వివరాలివే..

Flipkart Freedom Sale 2025 : ఆగస్టు 1 నుంచే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. 78 బ్లాక్ బస్టర్ డీల్స్, మరెన్నో బ్యాంకు ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు..

Flipkart Freedom Sale 2025

Updated On : July 30, 2025 / 7:59 PM IST

Flipkart Freedom Sale 2025 : ఆగస్టు ప్రారంభంలో వార్షిక ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుందని ఫ్లిప్‌కార్ట్ ధృవీకరించింది. ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్ సహా వివిధ కేటగిరీలలో కొనుగోలుదారులు వైడ్ రేంజ్ డిస్కౌంట్లను పొందవచ్చు.

సేల్ వ్యవధిలో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ సంబంధిత డీల్స్, ధర డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ ఆగస్టు 1 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. అధికారిక వెబ్‌సైట్ ఆగస్టు 2 ప్రారంభ తేదీగా పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 డీల్స్, డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ రాబోయే ఫ్రీడమ్ సేల్ కోసం బ్యాంకు బెనిఫిట్స్ మాత్రమే వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ సేల్ సమయంలో 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అర్హత కలిగిన బ్యాంక్ లావాదేవీలపై 15శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, సూపర్‌కాయిన్స్ రీడీమ్ చేయడం ద్వారా అదనంగా 10శాతం తగ్గింపు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.

Read Also : Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు..!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025లో 6 ప్రత్యేక డీల్ జోన్‌లు :
ఎక్స్ఛేంజ్ అవర్స్, 78 అవర్స్ ఫ్రీడమ్ డీల్, బంపర్ అవర్స్, టిక్ టాక్ డీల్స్, రష్ అవర్స్, ప్రైస్ పాయింట్. లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.

మరోవైపు అమెజాన్ కూడా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 కోసం రెడీ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మాదిరిగానే అమెజాన్ ప్రైమ్ సభ్యులు కూడా ఈ సేల్‌లోకి ముందస్తుగా యాక్సస్ చేయొచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌లు లేదా ఈఎంఐ పేమెంట్లను ఎంచుకునే కొనుగోలుదారులు ఈ ఈవెంట్ సమయంలో ఫ్లాట్ 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025 జూలై 17న ముగిసింది. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 , Nothing Phone 3a Pro, Samsung Galaxy S24 వంటి వివిధ ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.