Amazon Diwali Special Sale : అమెజాన్‌లో ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ మీకోసం..!
Amazon Diwali Special Sale : మీరు స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఆఫర్‌ల కోసం చూస్తుంటే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ 2024 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అత్యుత్తమ డీల్స్ పొందవచ్చు.

Amazon Great Indian Festival Diwali Special 2024 Sale
Amazon Diwali Special Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ 2024 సేల్ కొనసాగుతోంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఈ సేల్ మొదలైంది. ఇ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, వేరబుల్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్ వంటి వైడ్ రేంజ్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ సేల్ ప్రారంభమైనప్పటికీ, ప్రత్యేక దీపావళి సందర్భంగా లాభదాయకమైన డీల్స్ అందిస్తుంది.
కొనుగోలుదారులు డిస్కౌంట్లు, బ్యాంక్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, అక్టోబర్ 29న ఈ సేల్ ముగుస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఆఫర్‌ల కోసం చూస్తుంటే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ 2024 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అత్యుత్తమ డీల్స్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటి. ఈ హ్యాండ్‌సెట్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,999కు అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.74,999 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు రూ. వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డ్‌ల ద్వారా జరిపే లావాదేవీలపై రూ. 9వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. రూ. 10వేల వరకు బంపర్ రివార్డ్‌లు ఉన్నాయి. లావాదేవీ సమయంలో పూర్తి మొత్తాన్ని చెల్లించకూడదనుకుంటే.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ 2024 సేల్ సమయంలో అమెజాన్ అందించే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
Read Also : iPhone 15 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.30,901 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?