స్మార్ట్ ఫోన్ పై రూ.10వేలు డిస్కౌంట్ : అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్ మెంబర్లకు మాత్రం శనివారం(జనవరి 18,2020) అర్థరాత్రి నుంచే అందుబాటులోకి వస్తుంది. ఎప్పట్లాగే స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనా ధరలు తగ్గించింది.
స్మార్ట్ ఫోన్లపై 40శాతం వరకు, ల్యాప్ ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం వరకు తగ్గింపు లభించనుంది. దీంతో ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10వేలు దాకా ప్రత్యేక తగ్గింపు లభించనుంది. ఇక SBI క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ అదనం. వన్ ప్లస్ 7టీ, వన్ ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్ మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఆఫర్లు ఉన్నాయి. Oppo F 11 పై రూ.10వేలు దాకా డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుత సేల్‌లో ఒప్పో స్మార్ట్ ఫోన్‌ను రూ.13వేల 990 కే కొనుగోలు చేయొచ్చు.
* Samsung Galaxy M30s: 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999.. ఆఫర్ ధర రూ.12,999.
* Redmi Note 8 Pro: 6జీబీ+64జీబీ అసలు ధర రూ.14,999.. ఆఫర్ ధర రూ.13,999.
* Vivo U20: 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,990.. ఆఫర్ ధర రూ.9,990.
* Redmi Note 8: 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999.. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.1000 డిస్కౌంట్.
* Samsung Galaxy M30: 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,499.. ఆఫర్ ధర రూ.8,999.
* Samsung Galaxy M10s: 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,499.. ఆఫర్ ధర రూ.7,999.
* Nokia 4.2: 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,975.. ఆఫర్ ధర రూ.5,999.
* OPPO F11: ఒప్పో ఎఫ్11 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.14,990.. ఆఫర్ ధర రూ.13,990.
* Xiaomi Mi A3: 4జీబీ+64జీబీ అసలు ధర రూ.12,499.. ఆఫర్ ధర రూ.11,999. ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.1000 డిస్కౌంట్.
* Vivo U10: 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,990.. ఆఫర్ ధర రూ.7,990.
* Samsung Galaxy M40: 6జీబీ+128జీబీ అసలు ధర రూ.16,999.. ఆఫర్ ధర రూ.13,999.
* Nokia 6.2: 4జీబీ+64జీబీ అసలు ధర రూ.13,399.. ఆఫర్ ధర రూ.12,499.