Amazon Great Republic Day Sale : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్..!
Amazon Great Republic Day Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు.

Amazon Great Republic Day Sale
Amazon Great Republic Day Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ఏ కంపెనీ ల్యాప్ టాప్ కొంటె బెటర్ అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక కొత్త మోడల్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 12 గంటల ముందస్తు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులందరికీ వార్షిక విక్రయం జనవరి 13న మధ్యాహ్నం ప్రారంభమైంది.
మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, అప్లియన్సెస్, ఫ్యాషన్ దుస్తులు సేల్‌లో తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం ధరల కేటగిరీ నుంచి ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఈ సేల్ సమయంలో అనేక ఆకర్షణీయమైన ఆప్షన్లు ఉన్నాయి. అమెజాన్ సేల్ డిస్కౌంట్లతో పాటు, ఎంపిక చేసిన ప్రొడక్టులపై అదనపు కూపన్లు, బ్యాంక్ ఆధారిత ఆఫర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025లో హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి బ్రాండ్ల నుంచి ల్యాప్‌టాప్‌లు ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో, ఎం33 చిప్ కింద రూ. 3,69,900, ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 3,99,900 వరకు ఉంటుంది. అదేవిధంగా, అసూస్ జెన్‌బుక్ 14 అసలు ధర రూ. 1,22,990 ఉండగా రూ. 87,990కు పొందవచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసిన పేమెంట్లు 10 శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చు. ఇంకా, నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.