Amazon Prime Day Offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 55-అంగుళాల స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే..!
Amazon Prime Day Offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో 55-అంగుళాల స్మార్ట్ టీవీ జస్ట్ రూ. 28వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Amazon Prime Day Offers
- ఫిలిప్స్ 55 అంగుళాల 8100 సిరీస్ స్మార్ట్ టీవీ రూ. 36,999 ధర మాత్రమే
- షావోమీ 55 అంగుళాల FX అల్ట్రా స్మార్ట్ టీవీ రూ. 32,999కే కొనేసుకోవచ్చు
- VW 55 అంగుళాల ప్రో సిరీస్ స్మార్ట్ టీవీ రూ. 27,640 ధరకు లిస్టింగ్
Amazon Prime Day Offers : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి పండగే.. అమెజాన్ సేల్ సందర్భంగా 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి ప్రారంభమైంది.
ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వరకు అన్నింటిపై ఖతర్నాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. కొత్త టీవీ కోసం చూసేవారికి 55-అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్ టీవీల ధరలు ఎంతవరకు తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం..
టీసీఎల్ మెటాలిక్ బెజెల్ లెస్ టీవీ :
టీసీఎల్ 55-అంగుళాల మెటాలిక్ బెజెల్ లెస్ టీవీ సిరీస్ ఈ-కామర్స్ సైట్లో రూ. 34,640కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఫిలిప్స్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ :
ఫిలిప్స్ 55-అంగుళాల 8100 సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రూ. 36,999 ధరకే కొనేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా అన్ని బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
షావోమీ అల్ట్రా HD 4K స్మార్ట్ టీవీ :
షావోమీ 55-అంగుళాల ఎఫ్ఎక్స్ అల్ట్రా HD 4K స్మార్ట్ టీవీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ధర రూ. 32,999కు లభిస్తోంది. కూపన్లపై రూ. 1,500 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అలాగే, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్, మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు.
VW 55-అంగుళాల ప్రో సిరీస్ 4K టీవీ :
ఈ విడబ్ల్యూ 55-అంగుళాల ప్రో సిరీస్ 4K స్మార్ట్ టీవీ ఈ-కామర్స్ సైట్లో రూ. 27,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
విడబ్ల్యూ స్మార్ట్‌చాయిస్ 4కే టీవీ:
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో 55-అంగుళాల వైబ్ సిరీస్ 4K క్యూఎల్ఈడీ స్మార్ట్ VW టీవీ రూ. 35,490కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
