రిటైర్మెంట్ ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులలోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే అదే రోజు నుంచి మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా సీఈవో గా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా గ్రూప్ కంపెనీ ససాంగ్యోంగ్ మోటర్స్ చైర్మన్ గా కూడా రిటైర్డ్ అయ్యేవరకు గోయెంకా కొనసాగనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్-1,2021న గొయెంకా రిటైర్మెంట్ తరువాత ఎండీ,సీఈవో బాధ్యతలను అనిష్ షా చేపడతారని కంపెనీ తెలిపింది.
నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా …మేనేజింగ్ డైరెక్టర్ కోసం బోర్డుకు సమర్పించాల్సిన సమస్యలపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రణాళిక, రిస్క్ తగ్గించడం మరియు బాహ్య ఇంటర్ఫేస్ రంగాలలో ఒక గురువు మరియు సౌండింగ్ బోర్డుగా పనిచేస్తారని కంపెనీ తెలిపింది. తన కొత్త రోల్ లో… మహీంద్రా గ్రూప్ యొక్క మనస్సాక్షి కీపర్ గా, దాని విలువలకు సంరక్షకునిగా,దాని వాటాదారుల ప్రయోజనాలను చూసేవాడిగా నేను ఉంటాను అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. కంపెనీ అంతర్గత ఆడిట్ యూనిట్ తనకు రిపోర్ట్ చేయడం కొనసాగుతుందని ఆయన అన్నారు.