నాయిజ్ క్యాన్సిలేషన్ ఫీచర్ : ఆపిల్ AirPods Pro.. ధర ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : October 30, 2019 / 08:59 AM IST
నాయిజ్ క్యాన్సిలేషన్ ఫీచర్ : ఆపిల్ AirPods Pro.. ధర ఎంతంటే?

Updated On : October 30, 2019 / 8:59 AM IST

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త Airpods Pro లాంచ్ చేసింది. తేలికైన బరువు, చెవులుకు ఇంపైన డిజైన్, నాయిజ్ క్యాన్సిలేషన్ యాక్టివ్‌తో రూపొందిన ఈ ఎయిర్ పాడ్స్ అక్టోబర్ 30 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ల ద్వారా Airpods pro ఇయర్ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ ఎయిర్ పాడ్స్ ప్రో డివైజ్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఆపిల్ డివైజ్ ల్లో iOS 13.2 లేదా ఆపై వెర్షన్, iPadOS 13.2 లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు.. WatchOS 6.1 లేదా ఆపై వెర్షన్, tvOS 13.2 లేదా macOS Catalina 10.15.1 లేదా తర్వాతి వెర్షన్ డివైజ్ ల్లో సపోర్ట్ చేస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఇయర్ బడ్స్ మొత్తం మూడు విభిన్న పరిమాణాల్లో వస్తున్నాయి. సాఫ్ట్, ఫ్లెక్సిబల్, సిలికాన్ ఇయర్ టిప్స్ తో చెవులకు ఎంతో అనువైనా డిజైన్ తో సౌకర్యవంతంగా ఉంటాయని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఫిల్ సిచెల్లర్ చెప్పారు. వాటర్ రిసిస్టెంట్ కావడంతో నీటిలో తడిసిన కూడా ఎయిర్ పాడ్స్ ప్రో చక్కగా పనిచేస్తాయి. ఇందులోని యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ ఫీచర్.. రెండు మైక్రోఫోన్లతో కలిసి అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేయడంతో సౌండ్ సిగ్నల్ ఒక సెకన్ కు 200 సార్లు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. ట్రాన్స్ పరెన్సీ మోడ్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 

ఒకవైపు మ్యూజిక్ వింటూనే మరోవైపు బయటి సౌండ్ లను కూడా చక్కగా వినవచ్చు. నాయిజ్ క్సాన్సిలేషన్, ట్రాన్స్ పెరన్సీ మోడ్స్ సింపుల్ గా నేరుగా స్విచ్ అయ్యేలా ఉంది. ఎయిర్ పాడ్స్ ప్రో ద్వారా ఇన్నోవేటివ్ ఫోర్స్ సెన్సార్ ద్వారా ఈ రెండు మోడ్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. Airpods ప్రో ఫీచర్ లో గ్రేట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీనివల్ల మ్యూజిక్ ఏకధాటిగా 5 గంటల పాటు వినవచ్చు. ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ మోడ్ ద్వారా నాలుగున్నర గంటల పాటు లిజనింగ్ టైమ్, మూడున్నర గంటల పాటు టాక్ టైమ్ ఇస్తుంది. 

వైర్ లెస్ ఛార్జింగ్ కేస్ నుంచి అదనంగా ఛార్జ్ చేయడం ద్వారా ఎయిర్ పాడ్స్ ప్రో 24 గంటల లిజనింగ్ టైమ్ లేదా 18 గంటల టాక్ టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ ఎయిర్ పాడ్స్ తో పాటు ఛార్జింగ్ కేసు రూ.14వేల 900కే లభ్యమవుతోంది. ఎయిర్ పాడ్స్, వైర్ లెస్ ఛార్జింగ్ కేసు ధర రూ.18వేల 900కే అందుబాటులో ఉంది. స్టాండ్ అలోన్ వైర్ లెస్ ఛార్జింగ్ కేసును కస్టమర్లు రూ.7వేల 500లకే ఆర్డర్ చేసుకోవచ్చు. Airpods Pro ఇండియన్ మార్కెట్లలో త్వరలో రూ.24వేల 900లకే లభ్యం కానుంది.