Apple Days Sale 2025
Apple Days Sale 2025 : విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ మే 24 నుంచి ప్రారంభమైంది. జూన్ 1, 2025 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో లేటెస్ట్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల వినియోగదారులు ICICI, Axis, Kotak Mahindra బ్యాంక్ కార్డులతో రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.
ఆపిల్ డేస్ సేల్ : ఆఫర్లు, డిస్కౌంట్లు :
మీరు స్టోర్‌లో షాపింగ్ చేసినా లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా, విజయ్ సేల్స్ అనేక బ్యాంక్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో పాటు ఆకర్షణీయమైన ధరకు పరికరాలను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఐఫోన్ ఆఫర్లు : ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు :
ICICI, Axis, Kotak Mahindra బ్యాంక్ కార్డుల ద్వారా రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. విజయ్ సేల్స్ స్టోర్లలో వినియోగదారులు రూ.7,500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా పొందవచ్చు.
మ్యాక్‌బుక్ ఐప్యాడ్ డీల్స్.. విద్యార్థులకు ప్రత్యేకం :
కొత్త ఐప్యాడ్ అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నారా? మీరు విద్యార్థి లేదా ప్రొఫెషనల్ అయితే, లిమిటెడ్ సేల్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
వేరబుల్, ఆడియో : ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ :
బ్యాంక్ కార్డులతో అన్ని గాడ్జెట్లపై రూ. 3వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు పొందవచ్చు.
షాపింగ్ ఎక్కడ చేయాలి :
మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏ మోడ్‌నైనా ఎంచుకోవచ్చు. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అందుబాటులో ఉన్న 150+ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయొచ్చు.