Apple iPhone 15 : అమెజాన్‌లో క్రేజీ ఆఫర్.. లక్ష విలువైన ఐఫోన్‌ 15 అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ మిలియన్ల మంది కస్టమర్ల కోసం ఈ ఐఫోన్‌ను అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.

Apple iPhone 15

Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర మరోసారి తగ్గింది. ప్రస్తుతం ఐఫోన్ 15 కొనుగోలుపై దిమ్మతిరిగే డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం.

అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 15 512GB వేరియంట్‌పై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 15 పొందవచ్చు.

Read Also : Income Tax Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోండి.. డొంట్ మిస్..!

సాధారణంగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పండుగ సీజన్లలో స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తాయి. అయితే, అమెజాన్ తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. మొదటిసారిగా, అమెజాన్ మిలియన్ల మంది కస్టమర్ల కోసం ఐఫోన్ 15 (512GB)పై భారీ ధర తగ్గింపు అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లాట్ డిస్కౌంట్‌ను మాత్రమే కాకుండా సేవింగ్స్ కోసం అదనపు డీల్స్ కూడా అందిస్తోంది.

ఐఫోన్ 15 (512GB) డిస్కౌంట్ :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 512GBపై ఆకర్షణీయమై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,09,900కు జాబితా అయింది. కానీ, మీరు ఇప్పుడు ఈ ఐఫోన్ 15 మోడల్ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ వేరియంట్‌పై అమెజాన్ 23 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతో ధర కేవలం రూ. 84,999కి తగ్గింది. మీరు కేవలం డిస్కౌంట్ ద్వారా నేరుగా రూ. 25వేలు సేవ్ చేసుకోవచ్చు. తద్వారా రూ. 63వేల ధరలో కొనుగోలు చేయొచ్చు.

ఈ ఐఫోన్ 15 కొనుగోలుపై అమెజాన్ అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఐఫోన్ కొనుగోలుపై ఎక్కువ సేవ్ చేయొచ్చు. మీ పాత ఫోన్‌ను రూ.22,800 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందాలంటే.. మీ ఫోన్ ఫిజికల్, యాక్టివిటీ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.

మీరు ఫుల్ ఎక్స్ఛేంజ్ మొత్తానికి పొందితే.. మీరు ఈ ఫోన్‌ను దాదాపు రూ.48వేల కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా తక్కువ బడ్జెట్‌‌లో చూస్తుంటే.. అమెజాన్ ఈఎంఐ ప్లాన్ ద్వారా ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. మీరు కేవలం రూ.4,121 నుంచి నెలవారీ ఈఎంఐ చెల్లించవచ్చు. అలాగే, రూ.2,549 వరకు క్యాష్‌బ్యాక్‌తో బెస్ట్ బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 15 ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. స్టైలిష్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ విజన్‌కు సపోర్టు ఇచ్చే 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ iOS 17పై రన్ అవుతుంది.

Read Also : JioHotstar : IPL మ్యాజిక్.. జియో‌హాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. 10 కోట్ల సబ్‌స్క్రైబర్లను దాటేసింది.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

భవిష్యత్తులో అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పవర్‌ఫుల్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. ఐఫోన్ 15 6GB వరకు ర్యామ్, 512GB వరకు తగినంత స్టోరేజీ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు 48+12MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. అయితే, అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.