iPhone 16 Discount : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. కొత్త ధర ఎంతంటే?

iPhone 16 Discount : బ్లాక్ ఫ్రైడే సేల్ విజయ్ సేల్స్‌లో ఆపిల్ అభిమానులకు భారీ ధర తగ్గింపును అందిస్తోంది. కస్టమర్‌లు రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

iPhone 16 Discount : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. కొత్త ధర ఎంతంటే?

Apple iPhone 16 gets flat Rs 5k discount

Updated On : November 29, 2024 / 9:39 PM IST

iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? బ్లాక్ ఫ్రైడే సేల్ విజయ్ సేల్స్‌లో ఆపిల్ అభిమానులకు భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 16 ఒరిజినల్ ధర రూ. 79,900కు అందిస్తోంది. ఇప్పుడు సేల్ సమయంలో రూ. 74,990కి అందుబాటులో ఉంది.

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ డీల్ కొనసాగుతుంది. ఈ డీల్‌పై ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండానే అందిస్తోంది. అయితే, పెద్ద మొత్తంలో సేవ్ చేయాలనుకునే కొనుగోలుదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీని ప్రభావవంతమైన ధర రూ.69,990కి తగ్గుతుంది. అదనంగా, పాత ఐఫోన్ 13లో ట్రేడింగ్ చేసే వారు ఎక్స్‌ఛేంజ్ విలువలో రూ. 20వేల వరకు పొందవచ్చు. అదనంగా రూ. 3వేల బోనస్, ధరను రూ. 51వేలకి తగ్గిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేసేవారికి ఆప్షన్ కలిగి ఉంది. ప్రధాన భాగంలో పవర్‌ఫుల్ A18 చిప్ ఉంది. వేగవంతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన పవర్ సామర్థ్యాన్ని అందిస్తుంది. మునుపటి మోడళ్లతో పోల్చితే.. మెరుగైన బ్యాటరీ లైఫ్‌ని నిర్ధారిస్తూ గేమింగ్, మల్టీ టాస్కింగ్, హై-పెర్ఫార్మెన్స్ యాప్‌లను హ్యాండిల్ చేయొచ్చు.

ఫొటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఐఫోన్ 16 జూమ్-ఇన్ షాట్‌లకు అప్‌గ్రేడ్ చేసిన 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సహా 48ఎంపీ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. కొత్త కెమెరా కంట్రోల్ ఫీచర్‌తో యూజర్లు ప్రొఫెషనల్ గ్రేడ్ ఫొటోలు, వీడియోల సెట్టింగ్‌లను సులభంగా మార్చుకోవచ్చు.

6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. స్ట్రీమింగ్, గేమింగ్ లేదా బ్రౌజింగ్ కోసం పవర్‌ఫుల్ కలర్స్, ఇతర వివరాలను అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ డిస్‌ప్లే వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. సొగసైన డిజైన్‌ ఐఫోన్ 16 నీటి-నిరోధకతకు మన్నికను అందిస్తుంది. ఈ ఫోన్ మొత్తం బ్లాక్, వైట్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్ వంటి 5 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

మరో అదనంగా కొత్త యాక్షన్ బటన్, కెమెరా లేదా ఫ్లాష్‌లైట్ టూల్స్‌కు వేగంగా యాక్సస్ అందిస్తుంది. తద్వారా రోజువారీ పనులను మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో విజయ్ సేల్స్ గణనీయమైన తగ్గింపులు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందించనుంది. ఐఫోన్ 16 టెక్ ఔత్సాహికులకు ఐఫోన్ అభిమానులకు ఇర్రెసిస్టిబుల్ డీల్‌గా మారింది.

Read Also : Social Media Ban : ఆస్ట్రేలియాలో కొత్త చట్టం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై తొలిసారిగా నిషేధం..!