Apple iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే..!
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు రూ.14,210 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Pro
Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 16 ప్రో ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్రోలో 6.3-అంగుళాల OLED డిస్ ప్లే, A18 ప్రో చిప్‌సెట్, మల్టీఫేస్ కెమెరా సెటప్ ఉన్నాయి. కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మరికొద్ది రోజుల్లో లాంచ్ కానుంది.
గత ఏడాది ఫ్లాగ్‌షిప్ కోసం కొనుగోలు చేసే ఆపిల్ అభిమానులకు ఇదే అద్భుతమైన ఆఫర్. ప్రీమియం ధర వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్ ఈ ఐఫోన్ ధరను రూ.21వేల కన్నా ఎక్కువ తగ్గింపు ధరకే అందిస్తోంది. లక్ష కన్నా ఎక్కువ ఖర్చు చేయకుండా అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఆకర్షణీయమైన ఆప్షన్. ఐఫోన్ 16 ప్రో డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,19,900గా ఉండగా విజయ్ సేల్స్ ఈ ఐఫోన్ ధరను రూ.1,05,690కి లిస్ట్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు రూ.14,210 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.7,500 తగ్గింపు పొందవచ్చు.
Read Also : Post Office : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. నెలకు రూ. 11వేలు పెట్టుబడితో ఐదేళ్లలో ఎంత సంపాదించుకోవచ్చంటే?
తద్వారా ధర రూ.98,190కి తగ్గుతుంది. మొత్తం రూ.21,710 ఆదా చేయొచ్చు. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. మీరు అదనపు డిస్కౌంట్‌ల కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు. దాంతో ఐఫోన్ ధర మరింత తగ్గుతుంది.
ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.3-అంగుళాల LTPO OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10కి సపోర్టు, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. హుడ్ కింద, ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఐఫోన్‌లో 3582mAh బ్యాటరీ 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.
కెమెరా ఫ్రంట్ సైడ్ ఐఫోన్ 16 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.