Apple iPhone 17 Series : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఐఫోన్ 17 సిరీస్‌పై ఫస్ట్ టైమ్ భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 17 Series : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే డీల్ 2026 కోసం చూస్తున్నారా? ఈ డీల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌పై భారీ తగ్గింపు ఉండనుంది. ప్రతి ఐఫోన్ కొనుగోలుపై ఎంత ఆదా చేయొచ్చంటే?

Apple iPhone 17 Series : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఐఫోన్ 17 సిరీస్‌పై ఫస్ట్ టైమ్ భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 17 Series (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 3:00 PM IST
  • అతి త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం
  • ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ఎయిర్ మోడళ్లపై భారీ తగ్గింపు
  • అసలు ధర రూ. 1,49,900 నుంచి ధర రూ. 1,40,400కు తగ్గింపు

Apple iPhone 17 Series : ఆపిల్ లవర్స్ కోసం క్రేజీ ఆఫర్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 అతి త్వరలోనే ప్రారంభం కానుంది. హై-ఎండ్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లపై సూపర్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ఎయిర్ ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. జనవరి 16న సేల్ మొదలైనప్పుడు వినియోగదారులు బ్యాంక్ ప్రోత్సాహకాలు, సేవింగ్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లు వంటి అద్భుతమైన డీల్స్ కూడా లభ్యమవుతున్నాయి.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై డిస్కౌంట్ :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. అసలు ధర రూ. 1,49,900 ఉండగా సేల్ సమయంలో ధర రూ. 1,40,400తో కొనేసుకోవచ్చు. అంటే.. ఈ ఐఫోన్ కొనుగోలుపై రూ. 9500 ఆదా చేసినట్టే..

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్ ఫుల్ పవర్ అందిస్తుంది. ట్రిపుల్ 48MP రియర్ కెమెరా సెటప్‌తో హై క్వాలిటీ వీడియోలను తీయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ వంటి ఇతర డీల్స్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 17 ప్రోపై సూపర్ డీల్ :
అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 17 ప్రోపై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ రిటైల్ ధర రూ. 1,34,900 నుంచి రూ.1,25,400కు తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా ఐఫోన్ 17ప్రోపై రూ. 9,500 తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 17 Series

Apple iPhone 17 Series (Image Credit To Original Source)

ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రోకు పవర్ అందించే A19 ప్రో ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్, 3D గేమింగ్ అడ్వాన్స్ ప్రాసెసింగ్ కోసం అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అడ్వాన్స్ సెన్సార్లు, సాఫ్ట్‌వేర్ అసిస్టెన్స్ వంటి ప్రో-గ్రేడ్ కెమెరాలతో ప్రో మోడల్ తక్కువ వెలుతూరులో కూడా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు.

Read Also : Samsung Galaxy A55 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ అమెజాన్‌లో జస్ట్ రూ. 25,999కే.. ఎలాగంటే?

ఐఫోన్ ఎయిర్‌పై అదిరే డీల్స్ :
ఈ డీల్‌లో ఆపిల్ హై-ఎండ్, లైట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది. ఈ మోడల్ సాధారణంగా రూ. 99వేల ధర ఉంటుంది. అయితే, 2026లో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో రూ.91,249కి పొందవచ్చు. అంటే రూ. 7,751 సేవింగ్ పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ కూడా ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫొటోలు, వీడియోల కోసం సింగిల్ 48MP రియర్ కెమెరా ఉంది. కార్డ్ పేమెంట్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో రివార్డ్ ఆఫర్లతో ఐఫోన్ ఎయిర్ మరింత తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.