Virat Kohli : నాలుగేళ్ల త‌రువాత‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి విరాట్ కోహ్లీ.. దిగ‌జారిన రోహిత్ శ‌ర్మ ర్యాంక్‌

నాలుగేళ్ల త‌రువాత టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐసీసీ పురుషుల వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు.

Virat Kohli : నాలుగేళ్ల త‌రువాత‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి విరాట్ కోహ్లీ.. దిగ‌జారిన రోహిత్ శ‌ర్మ ర్యాంక్‌

Virat Kohli has reclaimed the No1 spot in the ICC ODI batting rankings (pic credit @bcci)

Updated On : January 14, 2026 / 2:29 PM IST

Virat Kohli : నాలుగేళ్ల త‌రువాత టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఐసీసీ పురుషుల వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఈ ఘ‌న‌త సాధించాడు. మ‌రో స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానం నుంచి రెండు స్థానాలు దిగ‌జారి మూడో స్థానానికి ప‌డిపోయాడు.

కోహ్లీ గ‌త కొంత‌కాలంగా భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. గ‌త ఐదు వ‌న్డేల్లో వ‌రుస‌గా ఐదు సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్ర‌స్థానానికి చేరుకోవ‌డం ఇది 11వ సారి. చివ‌రిసారిగా అత‌డు 2021లో టాప్-1గా నిలిచాడు. ఇక కివీస్ ఆట‌గాడు డారిల్ మిచెల్ రెండో స్థానానికి చేరుకున్నాడు.

Richest Indian cricketers : 2025లో టాప్ 5 ధ‌న‌వంతులైన భారత క్రికెటర్లు ఎవరు?

ఐసీసీ వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 785 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 784 రేటింగ్ పాయింట్లు
* రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 775 రేటింగ్ పాయింట్లు
* ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (అఫ్గానిస్తాన్‌) – 764 రేటింగ్ పాయింట్లు
* శుభ్‌మ‌న్ గిల్ (భార‌త్‌) – 725 రేటింగ్ పాయింట్లు

David Warner : డేవిడ్ వార్న‌ర్ రెండో కూతురు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ పిక్స్‌.. వైర‌ల్‌