Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఇలా పొందొచ్చు!

Apple MacBook Air M4 : మార్చి 2025లో విడుదలైన మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర అమెజాన్‌లో అసలు ధర రూ.99,900 నుంచి రూ.89,900కి భారీగా తగ్గింది.

Apple MacBook Air M4

Apple MacBook Air M4 : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డిస్కౌంట్ ధరకే లభ్యమవుతోంది. గత మార్చి 2025లో లాంచ్ అయిన ఈ మ్యాక్‌బుక్ ఇప్పటికే భారీ ధర తగ్గింపు పొందవచ్చు.

ప్రారంభంలో ఈ మ్యాక్‌బుక్ రూ. 99,900 ధరకు లభించగా, ఈ పవర్‌ఫుల్ కొత్త మ్యాక్‌బుక్ ఇప్పుడు అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Read Also : Vivo V50 Elite Edition : వివో V50 ఎలైట్ ఎడిషన్ వచ్చేస్తోందోచ్.. కిర్రాక్ కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

అప్‌గ్రేడ్ చేసే కొనుగోలుదారులకు ఇదే బెస్ట్ టైమ్. మ్యాక్‌బుక్ ఎయిర్M4 ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమెజాన్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 రూ.89,900 ధరకు జాబితా అయింది. లాంచ్ ధర నుంచి రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రస్తుత మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ.84,900కి తగ్గుతుంది. మ్యాక్‌బుక్ లేటెస్ట్ లాంచ్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌తో ఆపిల్ అభిమానులకు అందుబాటులో ఉంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు :
మ్యాక్‌బుక్‌ ఎయిర్ M4లో ఆపిల్ లేటెస్ట్ M4 చిప్‌సెట్‌తో పవర్ అందిస్తుంది. మునుపటి M3 మోడల్‌తో పోలిస్తే.. స్పీడ్, మెరుగైన పవర్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

అందులో డిఫాల్ట్‌గా 16GB ర్యామ్‌తో వస్తుంది. భారతీయ యూజర్ల కోసం రూపొందించిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను లేటెస్ట్ (macOS Sequoia)పై రన్ అవుతుంది.

13-అంగుళాలు, 15-అంగుళాల వెర్షన్లు రెండూ 60Hz రిఫ్రెష్ రేట్లు, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లిక్విడ్ రెటినా డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ కూడా అత్యున్నత స్థాయిలో ఉంది.

Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, డ్యూయల్ థండర్‌బోల్ట్ 4 (USB-C) పోర్ట్‌లతో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 1080p HD రికార్డింగ్‌కు సపోర్టు ఇచ్చే 12MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది.

Read Also : iPhone 17 Launch : ఆపిల్ ఫ్యాన్స్ కోసం ఐఫోన్ 17 సిరీస్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు, కెమెరా, డిజైన్ అన్నీ లీక్.. ఫుల్ డిటెయిల్స్!

అయితే, ఆపిల్ స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మాస్‌తో కూడిన 4-స్పీకర్ సెటప్‌తో సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. అంతేకాకుండా, 13-అంగుళాల వేరియంట్‌లో 53.8Wh బ్యాటరీతో ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చు.