iPhone 17 Launch : ఆపిల్ ఫ్యాన్స్ కోసం ఐఫోన్ 17 సిరీస్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు, కెమెరా, డిజైన్ అన్నీ లీక్.. ఫుల్ డిటెయిల్స్!
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ధర, స్పెషిఫికేషన్లు, డిజైన్, కలర్లు, కెమెరా వంటి అన్ని వివరాలు లీక్ అయ్యాయి.

iPhone 17 Launch Date
iPhone 17 Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 సెప్టెంబర్ 2025లో రిలీజ్ కానుంది. బిగ్ డిజైన్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది.
ఈ ఏడాది ఐఫోన్ మోడల్ బిగ్ డిస్‌ప్లే ప్రోమోషన్ సపోర్ట్, మెరుగైన పర్ఫార్మెన్స్, కెమెరా అప్‌గ్రేడ్‌లతో రానుందని సమాచారం.
Read Also : Apple iPhone 15 : ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 25వేలకే ఐఫోన్ 15.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!
డిమాండ్ తక్కువ కారణంగా ఆపిల్ “ప్లస్” మోడల్‌ను ఐఫోన్ 17 లైనప్ నుంచి పూర్తిగా తొలగించనుంది. బేస్ ఐఫోన్ 17 మోడల్ గురించి మరిన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 4 మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండగా, ఇందులో ప్లస్ వేరియంట్ బదులుగా కొత్త ఐఫోన్ 17 ఎయిర్ తీసుకురానుంది. బేస్ ఐఫోన్ 17 ఐఫోన్ 16 పోలి ఉంటుంది.
పిల్ ఆకారపు బంప్‌లో రెండు వర్టికల్ బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ఐఫోన్ 16 ప్రో సైజుతో సరిపోయే కొంచెం పెద్ద 6.3-అంగుళాల స్క్రీన్‌తో రావచ్చు.
ఐఫోన్ 17 కలర్స్ :
ఐఫోన్ 16తో ఆపిల్ అల్ట్రామెరైన్, టీల్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో ఐఫోన్ 17 క్లాసిక్ బ్లాక్, వైట్, పింక్‌లతో పాటు ఈ కొత్త షేడ్స్ అందించనుంది.
ఐఫోన్ 17 డిస్‌ప్లే :
ఆపిల్ మొదటిసారిగా 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌ను స్టాండర్డ్ ఐఫోన్ మోడల్‌కు తీసుకువస్తుందని భావిస్తున్నారు. గతంలో ప్రో మోడల్‌లకు ప్రత్యేకమైనది.
స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ శాంసంగ్ పవర్ LTPO OLED ప్యానెల్స్ ద్వారా వస్తుంది. ఆన్‌లో ఉండే డిస్‌ప్లే సపోర్టు కూడా అందిస్తుంది. దీనిపై ఎలాంటి ప్రకటన లేదు.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ కొత్త A19 చిప్ ద్వారా మెరుగైన 3nm ప్రాసెస్ ఆధారంగా ఐఫోన్ 17 పవర్ పొందే అవకాశం ఉంది. మెరుగైన పర్ఫార్మెన్స్, సామర్థ్యాన్ని అందిస్తుంది.
8GB ర్యామ్ ఉండొచ్చు లేదా సరఫరా లభ్యతను బట్టి 12GB పొందవచ్చు. ఛార్జింగ్ స్పీడ్ 35W వద్ద ఉండొచ్చు. ప్రస్తుత మోడళ్ల నుంచి బ్యాటరీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు లేవని చెబుతున్నారు.
ఐఫోన్ 17 కెమెరా :
ఫ్రంట్ కెమెరాలో మెయిన్ అప్‌గ్రేడ్ ఉంటుందని భావిస్తున్నారు. పాత 12MP వెర్షన్ స్థానంలో 24MP సెల్ఫీ కెమెరా. బ్యాక్ సెటప్ 48MP వెడల్పు, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.
ఐఫోన్ 17 లాంచ్ తేదీ (అంచనా) :
ఐఫోన్ 17 సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 13, 2025 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
భారత్‌లో ఐఫోన్ 17 ధర, USA, దుబాయ్ (అంచనా) :
అమెరికాలో ధర 899 డాలర్లు, భారత మార్కెట్లో రూ.89,900, యూఏఈలో AED 3,799 నుంచి ప్రారంభమవవచ్చు. మునుపటి కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.