Asus AI Laptops : భారత్‌లో అసూస్ కొత్త ఏఐ రెడీ ల్యాప్‌టాప్స్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Asus AI Laptops : టెక్ దిగ్గజం ఆసుస్ సరికొత్త గేమింగ్, ఏఐ రెడీ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త ఎఎండీ రైజెన్ ఏఐ-రెడీ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది.

Asus launches new range of AI-ready laptops in India ( Image Source : Google )
Asus AI Laptops Launch : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ సరికొత్త గేమింగ్, ఏఐ రెడీ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త ఎఎండీ రైజెన్ ఏఐ-రెడీ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది. కొత్త లైనప్‌లో ప్రోఆర్ట్, జెఫైరస్, టీయూఎఫ్ గేమింగ్, జెన్‌బుక్, వివోబుక్ సిరీస్‌లలో మోడల్‌లు ఉన్నాయి. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల స్పెసిఫికేషన్‌లు, ధరలపై ఓసారి లుక్కేయండి.
అసూస్ ఆర్ఓజీ జెఫైరస్ జీ16: స్పెషిఫికేషన్లు, ధర
– జీఏ605డబ్ల్యూఐ-క్యూఆర్067డబ్లూఎస్ : రూ. 2,49,990
– జీఏ605డబ్ల్యూవీ-క్యూపీ078డబ్ల్యూఎస్: రూ. 1,94,990
ఆర్ఓజీ (Zephyrus) జీ16 గేమర్‌లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ఎఎమ్‌డీ రైజెన్ ఏఐ 9 హెచ్ఎక్స్ 370 ప్రాసెసర్‌తో ఎన్‌వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4070 జీపీయూ వరకు పొందవచ్చు. ల్యాప్‌టాప్ క్యూహెచ్‌డీ+ 240Hz ఆర్ఓజీ నెబ్యులా డిస్‌ప్లేను 0.2ఎమ్ఎస్ రెస్పాండ్ టైమ్, 500నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
కేవలం 1.85 కిలోల బరువు, 14.9 మిమీ స్లిమ్‌గా ఉండే ఈ అల్యూమినియం సీఎన్‌సీ యూనిబాడీ ల్యాప్‌టాప్ పోర్టబిలిటీ, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 40జీబీపీఎస్ యూఎస్‌బీ 4 టైప్-సి పోర్ట్, ఫుల్ సైజు యూహెచ్ఎస్-II ఎస్‌డీ కార్డ్ రీడర్‌తో సహా ఫాస్ట్ ఛార్జింగ్, వై-ఫై7, ఐ /ఓ పోర్ట్‌ల ఫుల్ సెట్‌తో 90Wh బ్యాటరీని అందిస్తుంది.
అసూస్ ఆర్ఓజీ టీయూఎఫ్ గేమింగ్ ఎ14 : స్పెక్స్, ధర: రూ. 1,69,990
టీయూఎఫ్ గేమింగ్ ఎ14 ఒక కాంపాక్ట్ 14-అంగుళాల ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. ఎఎండీ రైజెన్ ఏఐ 9 హెచ్ఎక్స్ 370 ప్రాసెసర్‌ను 12 కోర్లు, 24 థ్రెడ్‌లతో కలిగి ఉంది. 5.1జీహెచ్‌జెడ్ వరకు క్లాక్ చేస్తుంది. టాప్ రేంజ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఎన్‌విఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 ఎంపికతో ర్యాడీయెన్ 890ఎమ్ ఐజీపీయూని అందిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ 32జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ మెమరీకి సపోర్టు ఇస్తుంది. గరిష్టంగా 2టీబీ ఎమ్.2 జనరేషన్ 4 ఎస్‌ఎస్‌డీతో వస్తుంది. సొగసైన డిజైన్‌లో 16.9ఎమ్ఎమ్ మందపాటి ఛాసిస్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 73డబ్లూహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 2.5కె 165Hz జీ-సింకరైజ్ డిస్‌ప్లే విజువల్స్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6ఈ, డిస్‌ప్లే పోర్ట్‌తో కూడిన డ్యూయల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి.
అసూస్ ప్రోఆర్ట్ పిక్స్13: స్పెక్స్, ధర రూ. 1,79,990 :
అసూస్ ప్రో ఆర్ట్ పిఎక్స్13 క్రియేటివిటీ నిపుణుల కోసం రూపొందించింది. హైపర్ఫార్మెన్స్ పోర్టబిలిటీతో కేవలం 1.38 కిలోల బరువు, 15.8ఎమ్ఎమ్ సన్నగా ఉంటుంది. ఎఎమ్‌డీ రైజన్ ఏఐ 9 365 ప్రాసెసర్, ఎన్‌విఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూ ద్వారా పవర్ పొందుతుంది.
13-అంగుళాల 3కె అసూస్ లుమినా ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ 100శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజ్, పాంటోన్ వెరిఫికేషన్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో డయల్‌ప్యాడ్ ఇంటిగ్రేషన్, ప్రోఆర్ట్ క్రియేటర్ హబ్, స్టైలస్ సపోర్ట్ కూడా ఉన్నాయి. క్రియేటర్లకు మల్టీఫేస్ టూల్‌గా మారుతుంది. ఎమ్ఐఎల్- ఎస్‌టీడీ 810హెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. వై-ఫై 7, వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది.
అసూస్ జెన్‌బుక్ ఎస్ 16 ఓఎల్ఈడీ స్పెక్స్, ధర: రూ. 1,49,990
జెన్‌బుక్ ఎస్ 16 ఓఎల్ఈడీ అనేది థిన్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో టాప్-టైర్ పర్ఫార్మెన్స్ కోరుకునే నిపుణుల కోసం రూపొందించిన ల్యాప్‌టాప్. ఎఎండీ రైజెన్ ఏఐ 9 హెచ్ఎక్స్ 370 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 120Hz రిఫ్రెష్ రేట్, 100శాతం డీసీఐ-పీ3 కలర్ గ్యామట్‌తో 16-అంగుళాల 3కె ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 1.1 సెం.మీ సన్నగా 1.5 కిలోల బరువు ఉంటుంది. గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ టైప్-సి ఛార్జింగ్, యూఎస్‌బీ 4 టైప్-సి, హెచ్‌డీఎమ్ఐ 2.1తో సహా బలమైన కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. జెన్‌బుక్ ఎస్ 16 ఓఎల్‌ఈడీ కూడా ఎమ్ఐఎల్- ఎస్‌టీడీ 810 హెచ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
అసూస్ వివోబుక్ ఎస్ 14 ఓఎల్ఈడీ స్పెషిఫికేషన్లు, ధర : రూ. 1,24,990
వివోబుక్ ఎస్ 14 ఓఎల్ఈడీ పవర్‌ఫుల్ పోర్టబుల్ మెషీన్ అవసరమయ్యే యూజర్ల కోసం రూపొందించింది. ఎఎమ్‌డీ రైజెన్ ఎఐ 9 హెచ్ఎక్స్ 370 ప్రాసెసర్, 24జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ కలిగి ఉంది. 14-అంగుళాల 3కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. విఈఎస్ఏ డిస్‌ప్లే హెచ్‌డీఆర్ ట్రూ బ్లాక్ 600 సర్టిఫికేషన్‌తో ప్యాన్‌టోన్ ధృవీకరించింది.
ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 17 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. విండోస్ హలో సపోర్ట్‌తో కూడిన ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరాను కలిగి ఉంటుంది. యూఎస్ ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ వంటి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
Read Also : Tecno Phantom V Fold 2 5G : టెక్నో నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర లీక్..!