Xiaomi X Pro QLED Series : షావోమీ నుంచి రెండు సరికొత్త క్యూఎల్ఈడీ సిరీస్ స్మార్ట్‌టీవీలు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
Xiaomi X Pro QLED Series : షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలు 4కె రిజల్యూషన్‌తో 65-అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. వీక్షకులకు అద్భుతమైన క్లియర్ కలర్ ఎక్స్‌పీరియన్స్ అందించే మ్యాగీక్యూ టెక్నాలజీని కలిగి ఉంది.

Xiaomi X Pro QLED Series smart TV launched in India
Xiaomi X Pro QLED Series : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? షావోమీ స్మార్ట్ టీవీల మార్కెట్‌లో రెండు సరికొత్త సిరీస్‌లను ప్రవేశపెట్టింది. గత ఫిబ్రవరిలో షావోమీ ఎక్స్ ప్రో సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత మరో రెండు సిరీస్‌లను ప్రవేశపెట్టింది. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్, షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్, మరో రెండు సిరీస్‌లు మూడు వేర్వేరు సైజుల్లో వస్తాయి.
Read Also : Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!
43-అంగుళాల స్మార్ట్ టీవీ ప్రో సిరీస్ ధర రూ. 29,999 వద్ద ప్రారంభమైతే, ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ అదే సైజులో రూ. 24,999 ప్రారంభ ధరతో వస్తుంది. ప్రో క్యూఎల్‌ఇడి సిరీస్ ప్రారంభంతో కంపెనీ మ్యాజిక్యూ ఫీచర్‌ను అందిస్తోంది. వినియోగదారుకు వ్యూ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డివైజ్‌లు, వాటి స్పెషిఫికేషన్లతో రెండింటినీ పరిశీలిద్దాం.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ ఎడిషన్ ధర ఎంతంటే? :
ఈ రెండు టీవీలు మూడు వేర్వేరు సైజుల్లో వస్తాయి. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్ 43-అంగుళాల, 55-అంగుళాలు, 65-అంగుళాలలో వస్తుంది. మరోవైపు, షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ 43-అంగుళాల, 50-అంగుళాలు, 55-అంగుళాలలో వస్తుంది. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్ 43-అంగుళాల ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. 55-అంగుళాల వేరియంట్ ధర రూ.44,999, 65-అంగుళాల ధర రూ.62,999కు పొందవచ్చు.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 43-అంగుళాల ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. 50-అంగుళాల వేరియంట్ ధర రూ.31,999, 55-అంగుళాల ధర రూ.35,999కు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కంపెనీ రూ. 2వేల తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ సేల్ ఆగస్ట్ 30న లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ టీవీలపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎఐ వెబ్‌సైట్, షావోమీ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్ :
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలు 4కె రిజల్యూషన్‌తో 65-అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. వీక్షకులకు అద్భుతమైన క్లియర్ కలర్ ఎక్స్‌పీరియన్స్ అందించే మ్యాగీక్యూ టెక్నాలజీని కలిగి ఉంది. మైక్రోసైట్ ప్రకారం.. టీవీలు స్లిమ్ బెజెల్స్‌తో “ఆల్-స్క్రీన్ డిజైన్”తో వస్తాయి. మెటల్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. షావోమీ 2024 ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్, గూగుల్ టీవీ నేచురల్ ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో ఆధారితమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ పాటు కంటెంట్ యాక్సెస్ కోసం 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు లీనమయ్యే సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ యూజర్లకు కంటెంట్ అందించడంలో సాయపడుతుంది. హోమ్‌పేజీలోని యాప్‌లలో కంటెంట్ కోసం సెర్చ్ చేసేందుకు టెక్నాలజీ రూపొందించింది. అదనంగా, ఐఎమ్‌డీబీ రేటింగ్‌లను ముందుగా సూచించే ప్రత్యేక ఫీచర్ కూడా కలిగి ఉంది. కొత్త షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు 2జీబీ ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది. కానీ 32జీబీ స్టోరేజీతో వస్తుంది.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ :
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ గూగుల్ టీవీ ద్వారా ఆధారితమైన ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్‌లలో డాల్బీ విజన్, డాల్బీ ఆడియోకి సపోర్టు అందిస్తాయి. మూడింట్లలో 4కె స్క్రీన్‌లతో వస్తుంది. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ టీవీ సిరీస్ అన్ని ఫీచర్లు, స్పెషిఫికేషన్లు కూడా ఉన్నాయి.