2025 January Bank Holidays : 2025 జనవరిలో ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు ఇదిగో..!

2025 January Bank Holidays : భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2025 జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉంటాయి.

2025 January Bank Holidays : 2025 జనవరిలో ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు ఇదిగో..!

2025 January Bank Holidays

Updated On : December 29, 2024 / 5:43 PM IST

Bank Holidays January 2025 : కొత్త సంవత్సరం దాదాపు వచ్చేసింది. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. మీరు జనవరి 2025లో బ్యాంకులకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, జనవరిలో బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే చెక్ చేసుకోవడం ముఖ్యం.

Read Also : RRB NTPC Exam Date 2024 : ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ తేదీ త్వరలో విడుదల.. పూర్తి వివరాలివే!

వచ్చే జనవరిలో వారంవారీగా బ్యాంకు సెలవులు, జాతీయ లేదా ప్రాంతీయ సెలవులతో సహా మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులు ప్రతి ఆదివారం నెలలో రెండో, నాల్గో శనివారాలు సెలవులు పాటిస్తాయి. అదనంగా, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో మూతపడనున్నాయి.

2025 జనవరి బ్యాంక్ సెలవులు ఇవే :
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2025 జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉంటాయి. జాతీయ సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడినా ప్రాంతీయ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి.

అంటే.. ఆ ప్రాంతాల్లోని బ్యాంకులు మాత్రమే మూతపడతాయి. 15 రోజుల మూసివేత దేశవ్యాప్తంగా వర్తించదని గమనించాలి. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు జాతీయ, వారపు సెలవు దినాలలో మాత్రమే మూతపడతాయి. అయితే, ప్రాంతీయ సెలవులతో సంబంధిత రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు.

భారత్‌లో 2025 జనవరిలో బ్యాంక్ సెలవులు :

  • జనవరి 1, 2025: కొత్త సంవత్సరం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు బుధవారం మూతపడనున్నాయి.
  • జనవరి 06, 2025: గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సోమవారం మూతపడనున్నాయి.
  • జనవరి 11, 2025: రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
  • జనవరి 12, 2025: ఆదివారం వారపు సెలవు.
  • జనవరి 13, 2025 : లోహ్రీ పండుగ కారణంగా సోమవారం పంజాబ్, కొన్ని ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
  • జనవరి 14, 2025: సంక్రాంతి, పొంగల్ కారణంగా మంగళవారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.
  • జనవరి 15, 2025 : తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తుసు పూజ సందర్భంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో బుధవారం బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జనవరి 23, 2025 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • జనవరి 25, 2025 : వారపు సెలవు కారణంగా శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
  • జనవరి 26, 2025 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జనవరి 30, 2025 : సోనమ్ లోసర్ కారణంగా గురువారం సిక్కింలో బ్యాంకులు మూతపడనున్నాయి.

Read Also : UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల.. వచ్చే జనవరి 3నే పరీక్ష..