August: ఆగస్టు.. ఈ నెల ఈ 6 విషయాలు గుర్తుంచుకోవాల్సిందే..
మీరు రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమానా? అయితే, ఆగస్టు 1 నుంచి మీకు కూడా జీఎస్టీ ఆ-ఇన్వాయిస్ తప్పనిసరి.

Financial facts to know in August
August – Financial facts: దేశంలో ఆర్థికం విషయంలో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగా మీ ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోండి. ముఖ్యంగా ఆరు విషయాలను గుర్తుంచుకోవాలి.
ఐటీఆర్
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (Income-tax Returns) గడువు జులై 31తో ముగుస్తుంది. వేతన జీవులు ఈ తేదీలోపే ఐటీఆర్‌లు దాఖలు చేయాల్సి ఉంది. ఆగస్టులో దాఖలు చేసుకోవాలంటే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి సంపాదిస్తున్న వారు రూ.5,000 ఫీజుతో దాఖలు చేయాలి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ.వెయ్యి జరిమానా కడితే సరిపోతుంది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పెనాల్టీతో ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
జీఎస్టీ
మీరు రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమానా? అయితే, ఆగస్టు 1 నుంచి మీకు కూడా జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధన కింద ఇది అమలు అవుతుంది. ఇంతకు ముందు ఈ నిబంధన రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ ఈ విషయంపై జూలై 28న ప్రకటన చేసింది.
బ్యాంకులకు సెలవులు
ఆగస్టులో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం, కొన్ని పండుగలు, వారాంతర సెలవుల్లో బ్యాంకులు తెరవరు. వాటిని బట్టి మీ ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి.
ఎల్పీజీ ధరల మార్పు
ఎల్పీజీ ధరలు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ 16వ తేదీన మారతాయి. ఆగస్టులో వంట గ్యాసుతో పాటు, ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే, పీఎన్జీ, సీఎన్జీ రేట్లలోనూ మార్పులు వస్తుండొచ్చు.
యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు విషయంలో
యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి బ్యాడ్ న్యూస్. క్యాష్ బ్యాక్, ప్రోత్సాహక పాయింట్ల నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. ఆగస్టు 12 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి హోటళ్లు, విమానాలు, మింత్రలో చేసిన ఖర్చుపై ఇక 1.5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.
ఎస్బీఐ ఎఫ్డీ
భారతీయ స్టేట్ బ్యాంక్ తమ అమృత్ కలాష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది. దీని ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ, ఇతర కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ అందుతుంది. పూర్తి వివరాలకు ఎస్బీఐ వెబ్‌సైట్ చూడొచ్చు.