Bank Savings Scheme
BoB Savings Scheme : ఏదైనా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. కోట్లాది మంది భారతీయులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)లో అనేక అకౌంట్లు ఉన్నాయి.
Read Also : AC Tips : మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ 3 టిప్స్‌తో మీరే ఫిక్స్ చేయొచ్చు..!
ఈ ప్రభుత్వ బ్యాంకు తమ ఖాతాదారులకు సేవింగ్స్ అకౌంట్లపై ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్ పథకాన్ని కూడా అందిస్తోంది. ఈ బ్యాంకులో మీరు కేవలం రూ. 1 లక్ష డిపాజిట్ చేయడం ద్వారా రూ. 16,022 స్థిర వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా 2 ఏళ్ల FD పథకం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2 ఏళ్ల BoB ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వరకు వడ్డీ :
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు వివిధ కాలపరిమితితో FD పథకాలపై 4.25 శాతం నుంచి 7.65 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ ప్రభుత్వ బ్యాంకు 444 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకంపై సాధారణ పౌరులకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 2 ఏళ్ల FDపై సాధారణ పౌరులకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను తగ్గించింది.
రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే.. రూ. 16,022 స్థిర వడ్డీ :
బ్యాంక్ ఆఫ్ బరోడా 2 ఏళ్ల FDలో కేవలం రూ. 1 లక్ష డిపాజిట్ ద్వారా రూ. 16,022 స్థిర వడ్డీని పొందవచ్చు. 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 ఏళ్ల ఎఫ్‌డీలో రూ. లక్ష డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 1,14,888 పొందవచ్చు.
ఇందులో రూ. 14,888 స్థిర వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ అందులో రూ. లక్ష డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 1,16,022 పొందుతారు. అందులో రూ. 16,022 స్థిర వడ్డీ పొందవచ్చు.
( Disclaimer : ఇది కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. డబ్బుకు సంబంధించిన ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. )