Bengaluru AI company
AI Job Offer : టెక్ కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే, మీ దగ్గర ఈ స్కిల్ ఉంటే చాలు.. ఆ ఉద్యోగమే మీకోసం వెతుక్కుంటూ వస్తుంది. ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదించుకోవచ్చు..
దీనికి మీ దగ్గర కాలేజీ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రెజ్యూమ్ రిచ్‌గా ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మీ దగ్గర స్కిల్ మాత్రమే పెట్టబడి అనమాట.. ఇలాంటి టెక్ స్కిల్స్ ఉన్న వారికోసమే బెంగళూరుకు చెందిన ఒక ఏఐ కంపెనీ చూస్తోంది.
Read Also : Instagram New App for Reels : ఇన్‌స్టాగ్రామ్ సంచలనం.. రీల్స్ కోసం కొత్త యాప్?
అదే.. స్మాలెస్ట్ ఏఐ. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ జాబ్ ఆఫర్ గురించి సోషల్ మీడియాను పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. స్కిల్స్ ఉన్న టెక్నీషియన్ల కోసమే ఈ జాబ్ ఆఫర్ అంట.. (ESOP)లతో సహా సంవత్సరానికి రూ. 40 లక్షల జీతం, వారానికి 5 రోజుల ఆఫీస్ వర్క్ ఆఫర్ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎడ్యుకేషన్, రెజ్యూమ్‌లను కూడా చూపించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పుడు ఇదే ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది.
We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI
Salary CTC – 40 LPA
Salary Base – 15-25 LPA
Salary ESOPs – 10-15 LPA
Joining – Immediate
Location – Bangalore (Indiranagar)
Experience – 0-2 years
Work from Office – 5 days a week
College – Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025
కాలేజీ సర్టిఫికేట్లు, రెజ్యూమ్ అక్కర్లేదు :
0 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులని కామత్ పేర్కొన్నారు. “మేం స్మాలెస్ట్ ఏఐలో క్రాక్డ్ ఫుల్-స్టాక్ ఇంజనీర్ కోసం చూస్తున్నాం. మీ గురించి బ్రిఫ్ ఇంట్రడెక్షన్ 100 పదాల్లో రాసి ఆయా స్కిల్స్ సంబంధించి ఏమైనా ఉంటే లింక్‌లను (info@smallest.ai)కి పంపండి” చాలు అన్నారు. “కాలేజీ సర్టిఫికేట్లు, రెజ్యూమ్ అసలు అక్కర్లేదు” అని స్పష్టం చేశారు. ఈ ఏఐ కంపెనీ ఆఫీసు బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంది.
జాబ్ ఆఫర్‌పై నెటిజన్ల రియాక్షన్ :
ఈ ఏఐ కంపెనీ పోస్టుకు ఇప్పటివరకూ 33,03,00 కన్నా ఎక్కువ వ్యూస్ రాగా, అనేక మంది యువ నిపుణులు, వ్యవస్థాపకులను ఆకట్టుకుంది. “మీరు CTC గురించి అబద్ధం చెబుతున్నారా (తప్పుడు సమాచారం ఇస్తున్నారా) లేదా సంవత్సరానికి ESOPలు ఉన్నాయా?” అని ఒక యూజర్ అనుమానం వ్యక్తం చేశాడు. “బెంగళూరులో ఇందిరా నగర్ చాలా లగ్జరీ ప్లేస్. చేతిలో రూ. 15 లక్షలు ఉన్నాయనుకుంటే.. సుమారు ఒక లక్ష, 35 వేలు షేరింగ్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకే చెల్లించాలి.
పైగా రోజువారీ గ్రాసరీల ఖర్చు, ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ లేదా ఇతర లోన్ల ఈఎంఐ కట్టడానికే సరిపోతాయి. బెంగళూరులో రూ. 20 వేలు సేవ్ చేస్తే వారు అదృష్టవంతులే” అని మరో యూజర్ రాసుకొచ్చాడు. “ఏఐ మోడల్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇంటర్వ్యూల సమయంలో భారతీయుల సెల్ఫ్ ఇంట్రడెక్షన్ ఎలా ఉంటుంది అనేదానిపై డేటాను సేకరించడానికి ఒక ఏఐ అల్గోరిథంకు ట్రైనింగ్ ఇస్తున్నాడేమో” అని మరో యూజర్ కామెంట్ చేశాడు.