ఇంకా ఆ పాత ఫోన్లను ఏం వాడతారు? మార్కెట్లో అతి తక్కువ ధరకు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఇవి కొనుక్కోండి..  

ఈ కింది టాప్‌ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే.

ఇంకా ఆ పాత ఫోన్లను ఏం వాడతారు? మార్కెట్లో అతి తక్కువ ధరకు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఇవి కొనుక్కోండి..  

Updated On : March 25, 2025 / 7:17 PM IST

భారతీయ మార్కెట్లోకి 5జీ ఫోన్ల ప్రవేశం ఐదేళ్ల క్రితం జరిగింది. అప్పట్లో చాలా లిమిటెడ్‌గా ఈ ఫోన్లు, సర్వీసులు, కనెక్టివిటీ ఉండేవి. ఇప్పుడు అందరూ కొంటే 5జీ స్మార్ట్‌ఫోన్‌నే కొనాలని భావిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మార్కెట్లో అనేక 5జీ ఫోన్లు ఉన్నాయి. రూ.15 వేలలోపు ఖర్చు చేసి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునే వారు ఈ కింది టాప్‌ ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే.

శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం14 5జీ రూ. 15,000 కంటే తక్కువ ధరకు లభ్యమవుతోంది. దేశంలో ఆ ధరకు లభించే కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. 5nm ప్రాసెసర్‌తో వచ్చిన ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.

రియల్మీ 9 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ మెడిన్సెన్సిటీ 810 SOCతో పనిచేస్తుంది. 6GB ర్యామ్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ 5జీ స్మార్ట్‌ఫోనులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది.

Also Read: షాపింగ్ మాల్స్‌కి, సినిమాలకు వెళ్లాక పార్కింగ్ ఫీజు కడుతున్నారా? ఇక కట్టొద్దు.. మీకో గుడ్‌న్యూస్‌.. 

మోటరోలా నుంచి మోటో జీ62 స్మార్ట్‌ఫోన్‌ రూ.15,000కు అందుబాటులో ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SOCతో పనిచేస్తుంది. మోటో జీ62 120 హెర్ట్‌జ్‌ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వచ్చింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంలో దీన్ని విడుదల చేశారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్ 14 కూడా రూ.15,000లోపు ధరకే లభ్యమవుతోంది. 5nm ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. ఇది 6.6-అంగుళాల 90 హెర్ట్‌జ్ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్ప్లేతో మార్కెట్లో అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్.

పొకొ ఎం4 ప్రొ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌తో 6nm మీడియాటెక్ మెడియెన్సిటీ 810 Socతో మార్కెట్లోకి వచ్చింది. పోకో ఎం4 ప్రోలోని కెమెరా స్టైలిష్‌గా ఉంది. ఫొటోగ్రఫీ ప్రియులను ఇది బాగా ఆకర్షిస్తుంది.

ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ కూడా రూ.15,000లోపు ధరకే లభ్యమవుతోంది. గేమింగ్‌ అంటే ఇష్టపడేవారు దీన్ని కొనుక్కోవచ్చు. దీని బ్యాటరీని ఫుల్‌ చేస్తే సుమారు 1.5 రోజులు వాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.