Best Premium Flagship Phones : ఈ నెలలో కొనాల్సిన బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Premium Flagship Smartphones : భారత మార్కెట్లో ఈ జూన్‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S23 Ultra 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.

Best Premium Flagship Phones : ఈ నెలలో కొనాల్సిన బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Premium Flagship Smartphones to buy in India this June 2023

Updated On : June 14, 2023 / 5:44 PM IST

Best Premium Flagship Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్, IP రేటింగ్‌లతో అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిజైన్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో సరైన అల్ట్రా-ప్రీమియం ఫోన్ ఎంచుకోవడం చాలా కష్టమే మరి. అందుకే జూన్‌లో భారత మార్కెట్లో అత్యుత్తమ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ కెమెరా సిస్టమ్‌లు, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ వంటి అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ మోడల్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

1. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G :
ఐఫోన్ 14 ప్రో తర్వాత ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో శాంసంగ్ ఫోన్ ఒకటి. గెలాక్సీ S23 Ultra 5G మోడల్.. మీరు ప్రీమియం ఫోన్ కోసం రూ. 1 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారా? అయితే శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ఫోన్ ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ గెలాక్సీ S22 Ultra మోడల్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్. 2023లో గెలాక్సీ S23 Ultra 5G బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అద్భుతమైన AMOLED డిస్‌ప్లే, మల్టీసైడ్ కెమెరా సెటప్, టైమ్‌లెస్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ S పెన్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌ కలిగి ఉంది. బ్యాటరీ పరంగా iPhone 14 Pro Maxతో పాటు Galaxy S23 Ultra ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మరో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

2. ఐఫోన్ 14 Pro సిరీస్ :
ఐఫోన్ 14 ప్రో సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. డిజైన్‌తో పాటు ఐఫోన్ 14 Pro, 14 Pro Max కూడా చాలా అద్భుతంగా ఉంది. ఐఫోన్ 14 ప్రో అనేది ఒక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ అసాధారణమైన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది. ఇందులో పవర్‌ఫుల్ OLED డిస్‌ప్లే, కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. ఆపిల్ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టు ఐఫోన్ 14 ప్రో సిరీస్ చాలా ఏళ్లుగా అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రో సిరీస్ 4 స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజ్‌ బేస్ మోడల్‌కు ధర రూ. 1,29,900 నుంచి మొదలయ్యాయి. iPhone 14 Pro సిరీస్ కొనుగోలు చేయడం ద్వారా అనేక డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. తద్వారా (iPhone 14 Pro)ని రూ. 1,20,000కే సొంతం చేసుకోవచ్చు.

Best Premium Flagship Smartphones to buy in India this June 2023

Best Premium Flagship Smartphones to buy in India this June 2023

3. వివో X90 ప్రో 5G :
మీరు గెలాక్సీ S23 Ultra కెమెరా సామర్థ్యాలతో తక్కువ ఇంకా తక్కువ ధర కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే.. (Vivo X90 Pro 5G) ఫోన్ బెస్ట్ ఆప్షన్. వివో X90 Pro స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ కెమెరా ప్రత్యేకమైన ఫీచర్లతో వచ్చింది. డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో పాటు, వివో X90 Pro మోడల్ 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. మంచి బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 50 శాతం బ్యాటరీతో కేవలం 8 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 84,999 ఉండగా, వివో X90 Pro అద్భుతమైన విలువను అందిస్తుంది.

4. గూగుల్ పిక్సెల్ 7 ప్రో :
గూగుల్ పిక్సెల్ (Google Pixel 7 Pro) 2022 టాప్ కెమెరా ఫోన్‌లలో ఒకటిగా ఉంది. లైటింగ్ పరిస్థితులతో సంబంధం లేకుండా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను అందించే అసమానమైన కెమెరా సామర్థ్యాలను అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కెమెరాలతో వస్తుంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో వంగిన AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ అందించే పవర్‌ఫుల్ 5,000mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, స్టాక్ ఆండ్రాయిడ్ 13తో సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. Pixel 7 Pro మోడల్ గూగుల్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ డివైజ్ ఆకర్షణీయమైన ఫీచర్లతో పిక్సెల్ 7 ప్రో టాప్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉన్నాయి.

Read Also : Amazon Flipkart Summer Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్ సేల్.. ఆపిల్ ఐఫోన్‌ 14పై రూ.12వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!