రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే
మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను రోజురోజుకీ ఎట్రాక్ట్ చేస్తోంది. చౌకైన ధరకే జియో ఫోన్, హైస్పీడ్ డేటా ఇంటర్నెట్ అందిస్తూ దూసుకెళ్తోంది.

మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను రోజురోజుకీ ఎట్రాక్ట్ చేస్తోంది. చౌకైన ధరకే జియో ఫోన్, హైస్పీడ్ డేటా ఇంటర్నెట్ అందిస్తూ దూసుకెళ్తోంది.
మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను రోజురోజుకీ ఎట్రాక్ట్ చేస్తోంది. చౌకైన ధరకే జియో ఫోన్, హైస్పీడ్ డేటా ఇంటర్నెట్ అందిస్తూ దూసుకెళ్తోంది. మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే జియో తన హైస్పీడ్ డేటాతో ఇతర టెలికం ఇండస్ట్రీలను షేక్ చేసింది. హైస్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్లను తక్కువ ధరకే అందిస్తూ యూజర్లను ఫిదా చేస్తోంది.
ఎప్పటికప్పుడూ కొత్త రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు ఆఫర్ చేస్తున్న జియో.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం 4G డేటా ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో రీఛార్జ్ ప్లాన్ ప్రారంభ ధర రూ.98, రూ.799 లపై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS ఆఫర్లు అందిస్తోంది.
Read Also : క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది
ఈ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. జియో టీవీ, జియో సావ్న్ (జియో మ్యూజిక్), జియో సినిమా జియో యాప్స్ ద్వారా 4జీ డేటా యాక్సస్ చేసుకోవచ్చు. జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం జియో 4జీ డేటా రీఛార్జ్ ప్లాన్లపై ఓసారి లుక్కేద్దాం.
4G డేటా రీఛార్జ్ ప్యాక్స్ మీకోసం..
రూ. 98 డేటా ప్లాన్ (2GB/4G) :
జియో ప్రీపెయిడ్ యూజర్లకు చీపెస్ట్ ప్లాన్ ఇదే.. రూ.98తో రీఛార్జ్ చేసుకుంటే.. 2GB, 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు. అంతేకాదు.. జియో యాప్స్ ను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడెటీ 28 రోజుల వరకు ఉంటుంది. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి దాటితే.. ఆ తర్వాత డేటా స్పీడ్ తగ్గిపోతుంది.
( రోజుకు 1.5GB 4G డేటా) :
4జీ డేటా ప్లాన్ (రోజుకు 1.5జీబీ డేటా)పై రిలయన్స్ జియో ఐదు ఆఫర్లు అందిస్తోంది. జియో రీఛార్జ్ ప్యాక్స్ రూ.149, రూ.349, రూ.449, రూ.1699 ఆఫర్ చేస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లపై రోజుకు యూజర్లు 1.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. ఐదు రీఛార్జ్ ప్యాక్ లపై వ్యాలిడెటీ 28 రోజులు, 70 రోజులు, 84రోజులు, 91రోజులు, 1 ఏడాది పాటు అందిస్తోంది.
రోజుకు 2GB డేటా :
రిలయన్స్ జియో 4జీ డేటాపై ప్రీపెయిడ్ యూజర్లకు రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ పై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. రీఛార్జ్ ప్లాన్లు వరుసగా రూ.198 (28 రోజులు), రూ.398 (70రోజులు), రూ.448 (84రోజులు), రూ.498 (91రోజులు) అందిస్తోంది.
రోజుకు 3GB డేటా :
ఈ సిగ్మంట్ కింద.. రిలయన్స్ జియో 4జీ డేటాపై రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది. 28రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.299తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు.
రోజుకు 4GB డేటా :
రిలయన్స్ జియో అందించే ఆఫర్లలో బెస్ట్ ఆఫర్.. ఇదే.. 4జీ డేటాపై రోజుకు యూజర్లు 4GB డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.509 తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 28 రోజులు కాగా.. 112GB డేటా పొందవచ్చు.
రోజుకు 5GB డేటా :
డేటా ఎక్కువగా వాడే యూజర్లుకు ఈ ప్లాన్ ఎంతో బెస్ట్. స్ట్రీమింగ్ సర్వీసులను వీక్షించే యూజర్లకు ఈ ప్లాన్ వర్క్ సరిగ్గా సరిపోతుంది. 4జీ డేటా రోజుకు 5జీబీ కావాలంటే రూ.799తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. రోజుకు 5జీబీ హైస్పీడ్ డేటాను 28 రోజుల కాలపరిమితిపై పొందవచ్చు.
జియో Top-UP రీఛార్జ్ :
రిలయన్స్ జియో కస్టమర్లు అందరికి 4జీ డేటా పొందే అవకాశం. జియో టాప్ అప్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ ప్యాక్ పొందవచ్చు. ఈ డేటా స్పీడ్ లిమిట్ దాటితే.. రోజువారీగా డేటా స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. ఈ ప్లాన్ పై డేటా లిమిట్ దాటినప్పటికీ అదనంగా డేటా పొందేందుకు జియో రెండు టాప్ అప్ రీఛార్జ్ డేటా ప్లాన్లను అందిస్తోంది. రూ.19, రూ.52 రీఛార్జ్ ప్లాన్ పై ఒక రోజు, వారంపాటు ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : రియల్ గేమ్ ఫైట్ : రేసు మధ్యలో ఇద్దరు బైకర్లు కొట్టేసుకున్నారు