Best Smartphones 2023 : ఈ నెలలో రూ.25వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!

Best Smartphones 2023 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 2023లో రూ.25వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో పాటు ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.

Best Smartphones 2023 : ఈ నెలలో రూ.25వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!

Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

Best Smartphones 2023 : స్మార్ట్‌‌ఫోన్ యూజర్లలో చాలామంది సరసమైన ధరలో ఫోన్ కోసం ఆసక్తిగా చూస్తుంటారు. మే 2023లో సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు సరిపోయే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

ఇందులో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నందున, సరైన ఆప్షన్ ఎంచుకోవడం కొద్దిగా కష్టమే మరి. డోంట్ వర్రీ.. అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధరలలో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు అత్యుత్తమ ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. మీరు గేమర్ అయినా, ఫొటోగ్రాఫర్ అయినా లేదా బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నా సరే.. ఈ ఫోన్ల జాబితాలో OnePlus Nord CE 3 Lite 5G సహా మరో 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.

1. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G :
వన్‌ప్లస్ (OnePlus Nord CE 3 Lite) ఫోన్ ఇటీవలే భారతీయ మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. ఈ ఫోన్ OnePlus లైనప్‌లో అత్యంత సరసమైన ఫోన్. 8GB RAM, 128GB స్టోరేజ్ ఫోన్లు ఉండగా.. బేస్ వేరియంట్ ధర రూ. 19,999, హై-ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.21,999గా ఉన్నాయి. నోర్డ్ CE 3 లైట్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది.

Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

Best Smartphones 2023 : Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

లైమ్ కలర్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. సరికొత్త 108MP ప్రైమరీ రియర్ కెమెరా, 120Hz IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ గత ఏడాది మోడల్ మాదిరిగానే భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, అదనంగా, 67W ఛార్జింగ్‌ సపోర్టుతో వచ్చింది. Nord CE 3 Liteలో క్లీన్ UI టెక్నాలజీ, OxygenOS 13.1 వంటి స్పెషిఫికేషన్లు ఉన్నాయి.

Read Also : Jio VR Headset : జియో ఫస్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదిగో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

2. పోకో X5 ప్రో 5G :
పోకో (Poco X5 Pro 5G) ఇటీవలి మార్కెట్లో రూ. 25వేల కన్నా తక్కువ ధరలో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 108MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. హై-రిజల్యూషన్ కెమెరాతో వచ్చిన పోకో ఫస్ట్ ఫోన్ కూడా ఇదే. Poco X5 Pro 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా ఆధారితమైనది. అదనంగా, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 120Hz HDR 10+ డిస్‌ప్లే కలిగి ఉంది.

Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

Best Smartphones 2023 to buy in India under Rs 25,000 in May 2023

లౌడ్, క్రిస్ప్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్లలో వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. భారీ 5,000mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. మొత్తంమీద, పోకో X5 Pro 5G అనేది రూ. 25వేల కన్నా తక్కువ ధర పరిధిలో అగ్రశ్రేణి ఫీచర్లతో హై పర్ఫార్మెన్స్ గల స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

3. రియల్‌మి 10 Pro+ 5G :
రియల్‌మి ఫోన్ (Realme 10 Pro+ 5G) 108MP ప్రైమరీ బ్యాక్ కెమెరా కలిగి ఉంది. అయితే, ఈ ఫోన్ కేవలం కెమెరాతోనే కాదు.. రూ. 25వేల లోపు అత్యుత్తమ ఫోన్‌ అని చెప్పవచ్చు. రియల్‌మి 10 ప్రో+ కెమెరాలతో లాంగ్ షాట్‌ తీయొచ్చు. ఈ ఫోన్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే కర్వడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బెజెల్‌లను కలిగి ఉంది.

Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

Best Smartphones 2023 to buy in India under Rs 25,000 in May 2023

ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. Realme 10 Pro+ దాని డైమెన్సిటీ 1080 SoCతో పాటు 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజీ ఆప్షన్‌తో వచ్చింది. రియల్‌మి 10 Pro+ 5G భారీ 5,000mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. మీరు మీ ఫోన్‌ను ఏ సమయంలోనైనా ఛార్జ్ చేయవచ్చు. ఈ 5G ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది.

4. ఐక్యూ Z6 Pro 5G :
ఈ జాబితాలో చివరి ఫోన్ (iQOO Z6 Pro 5G) ఇదే.. వాస్తవానికి, ఇటీవలే iQOO Z7 లాంచ్‌ అయింది. iQOO Z7 ప్రో లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే.. iQOO Z6 Pro అందుబాటులో ఉంది. సాధారణ పర్ఫార్మెన్స్, గేమింగ్‌తో వచ్చిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ ధరలో ఐక్యూ Z6 ప్రో ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ పెద్దగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.

Best Smartphones to buy in India under Rs 25,000 in May 2023

Best Smartphones 2023 to buy in India under Rs 25,000 in May 2023

మొత్తం ప్యాకేజీగా పరిశీలిస్తే.. iQOO Z6 Pro సాలిడ్ ఆల్‌రౌండ్ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ కొన్ని ఫీచర్లలో HDR10+ ప్లేబ్యాక్ సపోర్ట్‌తో 120Hz AMOLED డిస్‌ప్లే, భారీ 4,700mAh బ్యాటరీతో వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ 4 ఫోన్లలో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : Phone Call Scam : మీ ఫోన్‌కు ఇలాంటి ఫేక్ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. స్కామర్ల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?