PIQYU: 2000 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయనున్న BGAUSS
BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద, EV ఎకో సిస్టమ్‌ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు

BGAUSS: ప్రముఖ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ అయిన PIQYU, ప్రముఖ ఫైనాన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Bikebazaarతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BGauss వెల్లడించింది. చివరి-మైలు డెలివరీ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం, స్థిరమైన రవాణా పరిష్కారాల స్వీకరణను ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
Pawan Kalyan: నేను మీ సతీమణి భారతీ మేడమ్ గురించి మాట్లాడానా జగన్?: పవన్ కల్యాణ్
ఈ భాగస్వామ్యం ద్వారా BGAUSS నుంచి ప్రారంభ 150 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్సింగ్‌ను బైక్ బజార్ సులభతరం చేసింది. తద్వారా PIQYU ఈ వాహనాలను సజావుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యూహాత్మక భాఫాస్వామ్యం, హైదరాబాద్‌లో PIQYU యొక్క 3PL, లాస్ట్ మైల్ డెలివరీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ఈ సంవత్సరం ఇతర నగరాల్లో విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Nitin Gadkari: ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక ఈ మార్పులన్నీ వస్తాయి: తిరుపతిలో గడ్కరీ
BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద, EV ఎకో సిస్టమ్‌ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. ఈ తరహా B2B భాగస్వామ్యాలు జీరో ఉద్గారాల ద్వారా చివరి మైలు డెలివరీలను విస్తరింపచేయడానికి అనుమతిస్తుందని అన్నారు.
BG ఎలక్ట్రిక్ స్కూటర్లు BG D15ను విడుదల చేసింది. అత్యంత ఆకర్షణీయమైన, 16 వీల్స్ మెటల్ బాడీ స్కూటర్‌ను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసి, సౌకర్యం, భద్రతతో ఎక్కువ సవారీ చేయాలనుకునే భారతీయ వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి ఈ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చారని కంపెనీ తెలిపింది. ఇది కఠినమైన, స్టైలిష్, స్మార్ట్ ఉత్పత్తి, ఇది లాస్ట్ మైల్ డెలివరీ భాగస్వాములతో సహా ప్రతి EV ఔత్సాహికుల ఎంపికగా నిలువడానికి సాంకేతికత, అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని మిళితం చేస్తుందని అన్నారు.