Nitin Gadkari: ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక ఈ మార్పులన్నీ వస్తాయి: తిరుపతిలో గడ్కరీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని గడ్కరీ అన్నారు.

Nitin Gadkari: ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక ఈ మార్పులన్నీ వస్తాయి: తిరుపతిలో గడ్కరీ

Nitin Gadkari

Nitin Gadkari – Andhra Pradesh: కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ తిరుపతి(Tirupati)లోని రేణిగుంట (Renigunta) విమానాశ్రయం సమీపంలోని కొత్తపాలెం జాతీయ రహదారి వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని గడ్కరీ అన్నారు. దేశంలో పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము ఇతర మార్గాలపై దృష్టిపెట్టామని చెప్పారు. ఇథనాల్, మిథనాల్ వినియోగం వైపునకు మళ్లాల్సి ఉందన్నారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.15గా ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం బయో ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించనుందని చెప్పారు.

బయో ఇథనాల్ తో నడిచే బైక్ లను కొన్ని ప్రైవేట్ సంస్థలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయని తెలిపారు. పెట్రోల్ లీటర్ రూ.110 ఉందని, ఇథనాల్ మాత్రం రూ.60కే లభిస్తుందని చెప్పారు. బయో ఇథనాల్ వాడేందుకు సిద్ధంగా వాహనాలు తయారవుతున్నాయని తెలిపారు.

Pawar vs Pawar: ఒకే వేదిక మీదకు శరద్ పవార్, అజిత్ పవార్.. ఎన్సీపీ చీలిన తర్వాత ఇదే తొలిసారి