Dark patterns
Dark Patterns : అంతా ఈ-కామర్స్ మాయాజలం.. ఆఫర్లతో పేరుతో క్షణాల్లో జేబు ఖాళీ చేసేస్తారు. తక్కువ ధరకే ఆఫర్ ఉందని క్లిక్ చేస్తే.. ఒక్కసారిగా ధర పెరిగిపోతుంది.. అదే డార్క్ ప్యాటర్న్స్.. ఈ మాయలో చాలామంది వినియోగదారులు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇకపై ఇలాంటి ఆన్‌లైన్ ట్రిక్కులకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించే మోసపూరిత ‘డార్క్ ప్యాటర్న్స్’పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఈ మోసపూరిత పద్ధతులను గుర్తించి తొలగించి 3 నెలల్లోపు సెల్ఫ్-ఆడిట్ చేయాల్సిందిగా ఆయా ప్లాట్‌ఫారమ్‌లను కోరుతూ CCPA అడ్వైజరీ జారీ చేసింది.
కేంద్రం చర్యలతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి చర్యలకు కళ్లెం పడనుంది. తద్వారా ఆయా ప్లాట్ ఫారాలపై యూజర్లకు విశ్వాసం కూడా పెరుగుతుంది. ఆన్‌లైన్ మోసాలకు తమ ప్లాట్‌ఫామ్‌లు కేంద్రబిందువుగా మారాయా? అనేది ఇ-కామర్స్ కంపెనీలు చెక్ చేసుకోవాలని వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. డార్క్ ప్యాటర్న్స్ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఇప్పటికే ఈ-కామర్స్ సంస్థలకు CCPA నోటీసులు జారీ కాగా, ఏ కంపెనీలకు అనేది రివీల్ చేయలేదు.
13 రకాల డార్క్ ప్యాటర్న్స్ :
అవసరం లేని వస్తువులు, ఇతర సర్వీసులను వినియోగదారులు తీసుకునేలా ప్రేరేపించడమే డార్క్ పాటర్న్స్ అంటారు. వినియోగదారులను ఏది కొనాలో తెలియకుండా గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయిస్తారు. 13 రకాల డార్క్ పాటర్న్స్‌ను గతంలోనే CCPA గుర్తించింది. వీటికి దూరంగా ఉండాలని కూడా సూచించింది. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
ఫాల్స్ అర్జెన్సీ: ఏదైనా వస్తువును వెంటనే కొనేసుకోండి అంటూ వినియోగదారులను టెంప్ట్ చేయడం.. లేదంటే ఆఫర్ కోల్పోతామని గందరగోళానికి గురిచేయడం..
బాస్కెట్ స్నీకింగ్ : యూజర్ల పర్మిషన్ లేకుండా వస్తువులు, సర్వీసులను షాపింగ్ కార్ట్‌కు యాడ్ చేయడం. డొనేషన్, చారిటీ పేరుతో పేమెంట్ చెక్‌బాక్స్ యాడింగ్ వంటివి కస్టమర్లను మోసిగించే ప్రయత్నాల్లో భాగం.. వస్తువు రేటు కన్నా అదనంగా చెల్లించాలి.
సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్ : సర్వీసుల కోసం సైన్ అప్ చేయాలని అడగడం, క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేకపోవడం, క్యాన్సిల్ చేసేందుకు ట్రై చేసినా అవసరం లేని స్టెప్స్ మెథడ్స్ చూపించడం..
ఫోర్స్‌డ్ యాక్షన్ : అవసరం లేని వస్తువులను బలవంతం కొనిపించడం. వారెంటీ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో అవసరం లేని సర్వీసును అంటగట్టడం, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయాలని ఫోర్స్ చేయడం వంటివి..
కన్ఫామ్ షేమింగ్ : వీడియో, ఆడియో, టెక్స్ట్ రూపంలో యూజర్‌ను మభ్యపెట్టడం, ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నష్టమంటూ భయపెట్టడం వంటివి చేయడం.
న్యాగింగ్ : వెబ్‌సైట్, యాప్ డౌన్ లోడ్ చేయాలని పాప్ అప్ చూపించడం, నోటిఫికేషన్ ఆన్ చేయమని ప్రేరేపించడం వంటివి ఉంటాయి.
ఇంటర్ఫేస్ ఇంటర్ఫియరెన్స్ : ఇంటర్‌ఫేస్‌లో ఒక్కసారిగా మార్పులతో యూజర్లను తప్పుదోవ పట్టించడం. అవసరం లేనిదానికి హైలైట్ చేయడం వంటివి ఉంటాయి.
Read Also : PMSBY Scheme : చౌకైన ప్రభుత్వ బీమా పథకం.. జస్ట్ రూ. 20కే రూ. 2 లక్షల కవరేజ్.. ఎవరు అర్హులు, ఎలా అప్లయ్ చేయాలంటే?
బెయిట్ అండ్ స్విచ్: ఒక వస్తువు తక్కువ ధరకు కనిపిస్తుంది. అది కొనేందుకు ప్రయత్నిస్తే ఆ వస్తువుకు బదులుగా మరో వస్తువు కనిపిస్తుంది.
హిడెన్ కాస్ట్ : వస్తువు కొనేటప్పుడు ఒక ధర పేమెంట్ సమయంలో మరో ధర కనిపిస్తుంది.