PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. రూ. 2వేలు పడతాయో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు..!

PM Kisan : పీఎం కిసాన్ 20 విడత కోసం చూస్తున్నారా? రైతులు రూ. 2వేలు పడతాయో లేదో ఈ జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు.

PM Kisan Scheme

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 20వ విడత కోసం ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. దేశంలోని రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం (PM Kisan) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాదిలో రూ. 6వేలు నేరుగా ఆర్థిక సాయం పొందుతున్నారు.

Read Also : Moto G85 5G : అతి చౌకైన ధరకే మోటో G85 5G ఫోన్.. టాప్ ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

ఈ పథకంతో (PM Kisan) ప్రయోజనాలివే :
దేశంలోని కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 2వేలు నేరుగా రైతుల ఖాతాలకు ఏడాదికి మూడుసార్లు వాయిదాలలో పంపుతుంది. రైతులకు ఏటా మొత్తం రూ. 6వేలు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్ల జమ అవుతుంది.

ఇప్పుడు, కిసాన్ సమ్మాన్ యోజన యొక్క తదుపరి విడత, అంటే 20వ విడత, త్వరలో విడుదల కానుంది. అటువంటి పరిస్థితిలో, దేశంలోని లక్షలాది మంది రైతులు ఈ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తం వారి వ్యవసాయ ఖర్చులు మరియు రోజువారీ అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

20వ విడత విడుదల ఎప్పుడంటే? :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు మొత్తం 19 వాయిదాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపుతుంది. ఫిబ్రవరి 2025లో రైతుల ఖాతాకు 19వ విడత విడుదల అయింది.

గతంలో 18వ విడత అక్టోబర్ 2024లో విడుదల అయింది. దీని ప్రకారం.. 20వ విడత 2025 జూన్ చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

మీ పేరు ఉందో (PM Kisan) లేదో చెక్ చేయండి :
మీరు కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను పొందాలనుకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ జాబితాలో మీ పేరును చెక్ చేసేందుకు ముందుగా, పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)ని విజిట్ చేయాలి.

Read Also : Samsung Galaxy Z Fold 6 : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?

వెబ్‌సైట్ హోంపేజీలో మీరు ‘Beneficiary List’ లేదా ‘Beneficiary Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ పేరు ఉంటే లిస్టులో కనిపిస్తుంది.. లేదంటే మీరు రూ. 2వేలు పొందలేరు.