మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా: బిజినెస్ ఇంకచాలు, సమాజసేవ చేస్తా
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయన మైక్రోసాఫ్ట్ సలహాదారుగా కొనసాగనున్నారు.

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయన మైక్రోసాఫ్ట్ సలహాదారుగా కొనసాగనున్నారు.
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. తన సమయాన్ని గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. సామాజిక కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తానని బిల్ గేట్స్ చెప్పారు.
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు. దాన్ని ప్రపంచ నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
2000 సంవత్సరం వరకు కంపెనీ సీఈవోగా కొనసాగారు. 2014లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2008 నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. బిల్ గేట్స్ తప్పుకోవడంతో మైక్రో సాఫ్ట్ బోర్డులో 12 మంది ఉంటారు.
బిల్ గేట్స్ కలిపి పనిచేయడం గొప్ప గౌరవమని సత్యనాదెళ్ల తెలిపారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ శక్తిని ప్రజాస్వామ్యీకరించే ఉద్దేశంతో బిల్ గేట్స్ కంపెనీని స్థాపించారు. బిల్ గేట్స్ నాయకత్వం, విజన్ తో బోర్డు చాలా లాభపడిందని చెప్పారు. బిల్ గేట్స్ టెక్నికల్ పాషన్ సంస్థకు ఉపయోగపడుతుందన్నారు.
Also Read | తెరుచుకుంటున్న వైసీపీ గేట్లు.. వలసలు ఆపేందుకు టీడీపీ పాట్లు!