Bitcoin: బిట్‌కాయిన్‌ దూకుడు.. తొలిసారి లక్ష డాలర్లు దాటిన విలువ

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ రికార్డు స్థాయిలకు చేరింది. ఏకంగా లక్ష డాలర్ల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత ..

Bitcoin: బిట్‌కాయిన్‌ దూకుడు.. తొలిసారి లక్ష డాలర్లు దాటిన విలువ

Bitcoin

Updated On : December 5, 2024 / 10:28 AM IST

Bitcoin Price: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ రికార్డు స్థాయిలకు చేరింది. ఏకంగా లక్ష డాలర్ల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత కొన్ని వారాల్లోనే బిట్ కాయిన్ విలువ అమాంతం పెరుగుతూ వస్తోంది. అయితే, నేడు ఏకంగా లక్ష డాలర్లను దాటేసింది. అంటే భారత కరెన్సీలో ఒక్క బిట్ కాయిన్ విలువ రూ.84లక్షలకుపైగా చేరింది. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే దీని విలువ లక్ష డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512ను తాకింది. అయితే, భవిష్యత్తులో బిట్ కాయిన్ విలువ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Gold Price: వచ్చే ఏడాది బంగారం ధర భారీగా పెరగబోతుందా.. అందుకు కారణాలు ఏమిటంటే?

రెండేళ్ల క్రితం బిట్ కాయిన్ విలువ 17వేలు దిగువకు వెళ్లింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజున బిట్ కాయిన్ విలువ 69,374 డాలర్లుగా నమోదైంది. ట్రంప్ విజయం తరువాత బిట్ కాయిన్ విలువ క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయికి బిట్ కాయిన్ విలువ చేరింది. దీనికి ప్రధాన కారణాల్లో క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీనికితోడు మస్క్ కు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడంకూడా కారణమని పలు కంపెనీల సీఈవోలు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) చైర్మన్ గా పాల్ అట్కిన్ కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం వంటివి బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.