BMW X3 M40i xDrive : బీఎండబ్ల్యూ X3 M40i SUV కారు వచ్చేస్తోంది.. కేవలం రూ.5 లక్షలకే బుకింగ్ చేసుకోండి..!
BMW X3 M40i xDrive : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బీఎండబ్ల్యూ (BMW) ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేస్తోంది. కేవలం రూ. 5లక్షల ధరకే ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు.

BMW X3 M40i xDrive bookings are open now, Check Full Details
BMW X3 M40i xDrive : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ, లగ్జరీ కార్‌మేకర్ (BMW India) మొట్టమొదటి (BMW X3 M40i xDrive) కారును వచ్చే మే 2023లో లాంచ్ చేయనుంది. లాంచ్ చేయడానికి ముందుగానే కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. ప్రస్తుతానికి, పరిమిత యూనిట్లలో మాత్రమే BMW X3 మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. SUV మోడల్ కారు బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలుగా నిర్ణయించింది.
ఈ కారును మొదట వచ్చిన వినియోగదారులకు మొదటగా అందించనుంది. లగ్జరీ కార్‌మేకర్ BMW X3 M40i xDrive కారులో అనేక కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. బయట, లోపల అనేక విభిన్న M ఫీచర్లను చేర్చింది. BMW కస్టమర్‌లు (https://www.bmw.in/X3M40i) లింక్ ద్వారా విజిట్ చేయొచ్చు. కారు వెలుపలి, లోపలి భాగాన్ని 360° వ్యూతో చూడవచ్చు. సురక్షిత ఆన్‌లైన్ పేమెంట్ విధానం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట వచ్చిన వారికి మొదట సర్వ్ ప్రాతిపదికన జరుగుతాయని BMW ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also : Apple Jobs in India : భారత్‌లో లక్షకు పైగా ఆపిల్ ఉద్యోగాలు.. 72 శాతం మంది మహిళలే.. ఎందుకో తెలుసా?
BMW X3 M40i xDrive మోడల్ కారు 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ 6-సిలిండర్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. 355bhp శక్తిని, 500 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కారు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై వస్తుంది. ముందు భాగంలో పెద్ద వెంట్‌లతో కూడిన బంపర్‌ను కలిగి ఉంది. కస్టమర్‌లు తమ కారును స్పోర్టీ స్టయిల్లో మరింత మెరుగుపరచేలా స్పెషల్ M మిశ్రమాలతో కస్టమైజ్ చేసుకోవచ్చు.

BMW X3 M40i xDrive bookings are open now, Check Full Details
SUV కారులో 3.0-లీటర్ BMW M ట్విన్‌పవర్ టర్బో ఇన్‌లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 382bhp గరిష్ట శక్తిని అందిస్తుంది. 502Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. BMW X3 M40i xDriveలో అడాప్టివ్ M సస్పెన్షన్, M స్పోర్ట్ డిఫరెన్షియల్, M స్పోర్ట్ బ్రేక్‌లు, BMW xDrive ఆల్-వీల్ డ్రైవ్ ఉన్నాయి. స్సెషల్ M ఫీచర్లు కూడా ఉన్నాయి.
BMW X3 M40i xDrive SUV కారు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడి ఉంది. ఈ కారు BMW xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. BMW X3 M40i xDrive SUV కేవలం 4.9 సెకన్లలో 0-100 km/h దూసుకెళ్లగలదు.
250 km/h గరిష్ట వేగాన్ని అందజేస్తుందని కంపెనీ తెలిపింది. BMW X3 M40i xDrive అనేది లగ్జరీ పర్ఫార్మెన్స్ అందించే ప్రీమియం SUV కారుగా చెప్పవచ్చు. స్పీడ్, పవర్, స్టైల్‌ని అందించే వాహనాన్ని కోరుకునే కారు ప్రియులకు ఇది కచ్చితంగా సరిపోతుంది. BMW ఎల్లప్పుడూ లగ్జరీకి పెట్టింది పేరు.. BMW X3 M40i xDrive ఇందులో ఏమాత్రం మినహాయింపు కాదనే చెప్పాలి.