ఎయిర్‌టెల్, జియో కంటే బెటర్ : BSNL 4G కొత్త ప్లాన్.. రోజుకు డేటా ఎంతంటే?

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 4G డేటాప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ దేశంలో కొన్ని సర్కిళ్లలో మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇటీవలే BSNL తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఒకటి ప్రవేశపెట్టింది. రోజుకు 10GB డేటాను అందిస్తోంది. ఈ డేటా ప్లాన్ కేవలం 28 రోజుల కాలపరిమితిపై రూ.96లకే పొందవచ్చు. ఇదే డేటా ప్లాన్ మాదిరిగా మరొ డేటా ప్లాన్ కూడా అఫర్ చేస్తోంది. రూ.236తో రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది.
ఈ రెండు డేటా ప్లాన్లతో పాటు బీఎస్ఎన్ఎల్ రూ.96 డేటా ప్లాన్ పై 80GB డేటాను 28 రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. మరో డేటా ప్లాన్ రూ.236 రీఛార్జ్ చేస్తే 84 రోజుల కాలపరిమితిపై 2,360GB డేటాను పొందవచ్చు. ప్రస్తుతం.. బీఎస్ఎన్ఎల్ 4G డేటా కనెక్టవిటీ ఆంధ్రప్రదేశ్, కోల్ కతా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, చెన్నై, తమిళనాడు, గుజరాత్ సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఒకసారి దేశవ్యాప్తంగా 4G కనెక్టవిటీని అందుబాటులోకి తీసుకొచ్చాక ఇప్పటివరకూ అందించిన డేటా ప్లాన్లను నిలిపివేసే అవకాశం ఉంది.
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త 4G డేటా ప్లాన్ ఇతర పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియోల కంటే బెటర్ కాదా? అంటే అవును.. బెటర్ అనే చెప్పాలి. ప్రస్తుతం.. వోడాఫోన్ రూ.499 ప్లాన్ పై రోజుకు 1.5GB డేటా, 100SMS లను 70 రోజుల కాలపరిమితిపై ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో రూ.555 డేటా ప్లాన్ పై 1.5GB డేటాతో పాటు రోజుకు 100SMSలను 84 రోజుల కాల పరిమితిపై అందిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. ఎయిర్ టెల్.. రూ.249 డేటా ప్లాన్ పై రోజుకు 1.5GB డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తోంది. ఇందులో అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్, STD కాల్స్ కూడా చేయొచ్చు. రోజుకు 100SMS లు కూడా పంపుకోవచ్చు. వోడాఫోన్, జియో, ఎయిర్ టెల్ అందించే ఈ డేటా ప్లాన్ల కంటే తక్కువ ఖరీదుకే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పోలిస్తే BSNL డేటా ప్లాన్లు ఎంతో చౌకైనవిగా చెప్పవచ్చు. గత ఏడాదిలో వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ ఇతర నెట్ వర్క్ లకు ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే విధానాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో తమ కస్టమర్ల కోసం డిసెంబర్ 3 నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ రెండు కంపెనీలు 28 రోజుల కాల పరిమితిపై ఇతర నెట్ వర్క్ లకు 1,000 నిమిషాలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి.. అదే 84 రోజుల కాలపరిమితిపై 3,000 నిమిషాల వరకు ఆఫర్ చేస్తున్నాయి. 365 కాల పరిమితి అందించే ప్లాన్లలో 12,000 నిమిషాల వరకు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.