Income Tax Bill 2025 : బిగ్ బ్రేకింగ్.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. లోక్‌సభలో ఈ నెల 11నే కొత్త వెర్షన్ బిల్లు.. ఫుల్ డిటెయిల్స్..!

Income Tax Bill 2025 : గత ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు, 2025ను కేంద్రం ఉపసంహరించుకుంది.

Income Tax Bill 2025 : బిగ్ బ్రేకింగ్.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. లోక్‌సభలో ఈ నెల 11నే కొత్త వెర్షన్ బిల్లు.. ఫుల్ డిటెయిల్స్..!

Income Tax Bill 2025

Updated On : August 8, 2025 / 5:27 PM IST

Income Tax Bill 2025 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. బీజేపీ ఎంపై బైజయంత్ పాండా (Income Tax Bill 2025) అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులతో ఆదాయపు పన్ను బిల్లు కొత్త వెర్షన్‌ను ఆగస్టు 11న సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1961 స్థానంలో గత ఫిబ్రవరి 13న లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అదే తేదీన పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించారు. సెలెక్ట్ కమిటీ నివేదికను జూలై 21, 2025న లోక్‌సభలో సమర్పించింది. సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది.

Read Also : EPFO : ఈపీఎఫ్ఓ అద్భుతమైన స్కీమ్.. ఉద్యోగి సర్వీసులోనే చనిపోతే.. రూ.7 లక్షల వరకు బీమా.. ఎవరు అర్హులు? ఎలా క్లెయిమ్స్ చేయాలంటే?

బిల్లు ఉపసంహరణ ఎందుకంటే? :
ఈ బిల్లులో చేర్చాల్సిన అవసరమైన అన్ని సూచనలు అందాయి. 31 మంది సభ్యుల కమిటీ కొత్త చట్టంలో మతపరమైన-కమ్-ధార్మిక ట్రస్టులకు ఇచ్చే అనామక విరాళాలపై పన్ను మినహాయింపును కొనసాగించాలని, పన్ను చెల్లింపుదారులు ITR దాఖలు గడువు తేదీ తర్వాత కూడా ఎలాంటి జరిమానా ఛార్జీలు చెల్లించకుండా TDS వాపసును క్లెయిమ్ చేసేందుకు అనుమతించాలని సూచించింది.

అందుకే, సెలెక్ట్ కమిటీ నివేదించిన విధంగా ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కొత్త బిల్లులో అనేక వెర్షన్లతో కలిగే గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆదాయ పన్ను బిల్లును ఉపసంహరించుకున్నట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు.

కొత్త ముసాయిదా అన్ని మార్పులతో సవరించి పరిశీలన కోసం లోకసభ ముందు ఉంచనుంది” అని పేర్కొన్నారు. కొత్త బిల్లులో ప్రభుత్వం లాభాపేక్షలేని సంస్థలకు (NPO) పూర్తిగా మతపరమైన ట్రస్టులు స్వీకరించే అనామక విరాళాలపై పన్ను విధించకుండా మినహాయింపు ఇచ్చింది. అయితే, ఆస్పత్రులు, విద్యా సంస్థల నిర్వహణ వంటి ఇతర ధార్మిక విధులతో మతపరమైన ట్రస్టులు పొందే విరాళాలపై బిల్లు ప్రకారం చట్టం ప్రకారం పన్ను విధిస్తుంది.