దేశంలో మరో అతిపెద్ద ఆర్థిక స్కామ్ : కోబ్రాపోస్ట్ సంచలనం

దేశంలో మరో అతిపెద్ద పైనాన్షియల్ స్కాం కలవరపెడుతోంది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటిడెట్ (డీహెచ్ఎఫ్ఎల్‌)లో 31వేల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రా

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 03:40 PM IST
దేశంలో మరో అతిపెద్ద ఆర్థిక స్కామ్ : కోబ్రాపోస్ట్ సంచలనం

Updated On : January 29, 2019 / 3:40 PM IST

దేశంలో మరో అతిపెద్ద పైనాన్షియల్ స్కాం కలవరపెడుతోంది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటిడెట్ (డీహెచ్ఎఫ్ఎల్‌)లో 31వేల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రా

దేశంలో మరో అతిపెద్ద పైనాన్షియల్ స్కాం కలవరపెడుతోంది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటిడెట్ (డీహెచ్ఎఫ్ఎల్‌)లో 31వేల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రా పోస్ట్ ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్‌ ప్రమోటర్లు, ప్రమోటర్లకు చెందిన షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే భారీగా నిధులు మళ్లినట్లు కోబ్రా పోస్ట్ తెలిపింది. ఒకే అడ్రస్‌తో ఉన్న కంపెనీలు.. అసలు ఊరూపేరూ లేని 45 కంపెనీలకు కూడా రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. వాటి నుంచి నిధులు విదేశాలకు వెళ్లిపోయాయని… వాటితో.. ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు… జల్సాలు చేసుకున్నారని కోబ్రాపోస్ట్ తెలిపింది.

 

మురికివాడల అభివృద్ధి పేరుతో… రుణాలు, గ్రాంట్లు సేకరించి భారీ మోసానికి పాల్పడ్డారని తెలిపింది. అంతేకాకుండా… కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే… 21వేల 477కోట్ల రూపాయలు షెల్ కంపెనీలోకి చేరాయని తెలిపింది. 2015-2018 మధ్య కాలంలో 32 బ్యాంకుల నుంచి రుణాలు సేకరించినట్లు కథనాన్ని ప్రచురించింది. కంపెనీ ప్రమోటర్స్…ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే లోన్లుగా తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఒక్క ఎస్‌బీఐ నుంచే సుమారు 11వేల 500 కోట్ల రూపాయలు తీసుకున్నారని… 15 బ్యాంకుల నుంచి 15వందల కోట్ల చొప్పున తీసుకున్నట్లు కోబ్రా పోస్ట్ ఆధారాలతో సహా బయటపెట్టింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా నిర్ధారించింది.