డిసెంబర్ 31 లాస్ట్ డే : క్రెడిట్/డెబిట్ కార్డులు మార్చుకున్నారా..
బ్యాంకుల నుండి మీ మీఃఃఫోన్లకు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా ? ఆ పంపిస్తూనే ఉంటారు..అంతగా ట్టించుకోవాల్సినవసరం లేదు..అని అనుకుంటే మాత్రం మీకు తీరని నష్టం కలుగనుంది.

బ్యాంకుల నుండి మీ మీఃఃఫోన్లకు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా ? ఆ పంపిస్తూనే ఉంటారు..అంతగా ట్టించుకోవాల్సినవసరం లేదు..అని అనుకుంటే మాత్రం మీకు తీరని నష్టం కలుగనుంది.
బ్యాంకుల నుంచి మీ మీ ఫోన్లకు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా ? ఆ పంపిస్తూనే ఉంటారు.. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు..అని అనుకుంటే మాత్రం మీకు తీరని నష్టం కలుగనుంది. ఎస్..నిజం..డిసెంబర్ 31 తరువాత మీ క్రెడిట్.. డెబిట్ కార్డులు అసలు పనిచేయవు. ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం…పాత డెబిట్..క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కార్డులను అప్‌గ్రిడ్ చేసేస్తున్నాయి. కొత్త కార్డుల జారీకి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు.
50-70 శాతమే కార్డుల మార్పు…
డిసెంబర్ 31లోగా కార్డులు మార్చుకోవాలంటూ ఆయా బ్యాంకులు ఖాతాదారులకు ఎస్ఎంఎస్‌లు పంపాయి. కానీ చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 50-70 శాతం వరకు మాత్రమే ఆయా బ్యాంకులు కార్డులు మార్చినట్లు టాక్. సమయం ఉంది కదా..తరువాత వెళుదాంలే అని కస్టమర్లు అనుకోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. గడువుకు మరో వారం రోజులే మాత్రమే ఉంది. సో…వెంటనే వెళ్లి కార్డులను మార్చుకొండి…