ఆన్‌లైన్‌లో ఆయిల్ ఆర్డర్ : కోరిన చోటుకే డీజిల్.. పెట్రోల్‌బంక్ వద్దకు వెళ్లాల్సినవసరం లేదు
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది. కస్టమర్ అడ్రస్ ఇచ్చి క్లిక్ కొడితే.. కావాల్సిన చోటుకి డీజిల్ వచ్చి చేరుతోంది. దీంతో బంక్‌లో క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే ట్యాంక్ నింపుకొనే సౌలభ్యం గుమ్మం ముందుకు వచ్చేసింది.
టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఏది కావాలంటే అది గుమ్మం ముందుకే వస్తోంది. చివరికి డీజిల్ కూడా. బండి బంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఇంటికే డెలివరీ వచ్చేస్తోంది. వెహికల్స్, మెషినరీ, జనరేటర్లు నడిపేందుకు అవసరమైన డీజిల్‌ను ఇన్నాళ్లు పెట్రోల్‌బంకుల వద్దకు వెళ్లి కావాల్సినంత కొనుగోలు చేసి, తెచ్చుకోవాల్సి వచ్చేది.
ఇకపై ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి అలాంటి శ్రమ అక్కర్లేదు. మీ ఫోన్లో యాప్ సాయంతో కోరిన చోటుకే కావాల్సిన డీజిల్‌ను సులభంగా రప్పించుకోవచ్చు. భారత పెట్రోలియం సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖ నుంచి ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు అవసరమయ్యే డీజిల్‌ను సరఫరా చేయడానికి ఫ్యూయల్‌కార్ట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
మైసూర్, కోయంబత్తూర్, పూణే వంటి ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ తీసుకొచ్చింది బీపీసీఎల్. బంకులో ధరకు, యాప్‌లో బుక్ చేసుకున్న ధరకు ఎలాంటి తేడా ఉండకుండా ఫ్యూయల్ కార్ట్‌కు భారత ప్రభుత్వ పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్, సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కనీసం 200 లీటర్ల నుంచి 4వేల లీటర్ల వరకు ఆయిల్‌ను ఆర్డర్ చేయొచ్చు.
డీజిల్‌ని బుక్ చేసుకునేందుకు రెపోస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో వినియోగదారుడి పేరు, చిరునామా వివరాలతో పాటు ఎన్ని లీటర్ల డీజిల్ అవసరం, ఎప్పుడు సరఫరా చేయాలన్న వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బంకును ఎంపిక చేసి ఆన్‌లైన్‌లోనే డబ్బులు కట్టాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. జియో ట్యాగింగ్ ఉన్నందున్న డీజిల్ తీసుకొచ్చే వాహనం ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.
డీజిల్ రవాణా వాహనానికి జియో ఫెన్సింగ్ ఉండడం వల్ల ఆయిల్ చోరీకి అవకాశం ఉండదని చెబుతున్నారు. పైగా ఆర్డర్ ఇచ్చిన వెంటనే వినియోగదారుడి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ పాయింట్‌లో ఓటీపీ నెంబరును నమోదు చేస్తేనే ఆయిల్ అన్‌లోడ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల కల్తీ జరిగే వీలుండదు. ఫ్యూయల్ కార్ట్‌కు ఆశించిన దాని కంటే ఎక్కువ స్పందన వస్తోంది. గత పది రోజుల్లో ఎక్కువ మంది యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు.