Stock Market : స్టాక్ మార్కెట్లకు దివాళీ జోష్.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో దీపావళి జోష్ కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి

Stock Market
Stock Market : స్టాక్ మార్కెట్లలో దీపావళి జోష్ కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ అన్ని రంగాల కౌంటర్లు లాభాల్లో కొనసాగడంతో సెన్సెక్స్ 930, నిఫ్టీ 250 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతున్నాయి. మార్కెట్లను లీడ్ చేస్తున్న ఆటో, మెటల్ ఇండియా సెక్టార్స్ లో ఒక్కశాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ సైతం 234.75 పాయింట్ల లాభంతో 24,415.55 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ తో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.