ఆల్ బెనిఫెట్స్ గెట్ వన్స్ : ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ఎన్ని లాభాలో?

కారు కొనాలనే కోరిక ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త కారు రాగానే కొందరు అవసరం ఉన్న లేకున్నా వెంటనే కొనేస్తుంటారు. మరికొందరు బెనిఫెట్స్ ఎలా ఉన్నాయో చూసి కొంటుంటారు.

  • Published By: sreehari ,Published On : February 20, 2019 / 02:44 PM IST
ఆల్ బెనిఫెట్స్ గెట్ వన్స్ : ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ఎన్ని లాభాలో?

కారు కొనాలనే కోరిక ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త కారు రాగానే కొందరు అవసరం ఉన్న లేకున్నా వెంటనే కొనేస్తుంటారు. మరికొందరు బెనిఫెట్స్ ఎలా ఉన్నాయో చూసి కొంటుంటారు.

కారు కొనాలనే కోరిక ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త కారు రాగానే కొందరు అవసరం ఉన్న లేకున్నా వెంటనే కొనేస్తుంటారు. మరికొందరు బెనిఫెట్స్ ఎలా ఉన్నాయో చూసి కొంటుంటారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కార్లు అన్నీ పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్లే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారత మార్కెట్లలోకి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కార్లు రానున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV)కల్చర్ ను పరిచయం చేసేందుకు భారతీయ కంపెనీలు తీవ్రంగా కసరత్తు ప్రారంభించాయి. అంతేకాదు.. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను ఆఫర్లు చేస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

మీరు ఏదైనా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. ముందుగా ఏం చేస్తారు. ఏ బ్యాంకు నుంచి అయిన కారు లోన్ తీసుకోవాలనుకుంటారు. అదే.. EV కారు కొనాలనుకుంటే… తక్కువ వడ్డీకే లోన్ ఇస్తారు. సబ్సిడీ కూడా ఉంటుంది. ఇంధన కార్లు లాగా ఎలక్ట్రికల్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ ఉండదు. అంతేకాదు.. ఆయిల్ బంకులు ఎలా ఉన్నాయో.. అలాగే.. ఇండియన్ హైవేలు, మెయిన్ రోడ్లపై ప్రతి 25 కిలోమీటరుకు ఒక ఛార్జింగ్ స్టేషన్ రానుంది. ట్యాక్స్ డిడెక్షన్స్, టోల్ ఫీ నుంచి మినహాయింపు ఉండొచ్చు. EV వాహనాల రాకతో సగానికిపైగా ఎలక్ట్రికల్ వెహికల్ కొనేందుకు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. తద్వారా కనీస రిబేట్ రూ.50వేలకు సగానికి పైనే ఉంటుందని భావిస్తున్నారు. వెహికల్ మోడల్, బ్యాటరీ సైజుపై సబ్సిడీ ఆధారపడి ఉంటుంది. 

EV కార్లపై లోన్ల రేట్లు కూడా చాలావరకు తగ్గనున్నాయి. పార్కింగ్ ఫీ, సబ్సిడీ ఫీజు, రోడ్ ట్యాక్స్ ఇలా మరెన్నో బెనిఫెట్స్ పొందొచ్చు. త్వరలో ఈ విధానం భారత్ లో అమల్లోకి రానుంది. ఈ ప్రయోజనాలన్నీ వచ్చే రెండో దశ ఫేమ్ ఇండియా స్కీంలో భాగంగా రానున్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ స్కీంను కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. రెండో విడత స్కీంలో ఐదేళ్ల కాలంలో మొత్తం రూ.5వేల 500 కోట్ల వరకు ఖర్చు పెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించిన పలు కంపోనెంట్స్ పై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రికల్ కార్లు అందుబాటులో లేవు. టాటా టైగర్ కంపెనీ దశలు వారీగా EV కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రికల్ కార్లతో ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసు ఫెసిలిటీలను అందుబాటులోకి తేనుంది. ఇదే జరిగితే.. టైగర్ EV కార్లను త్వరలో భారత రోడ్లపై చూడొచ్చు. 

ఎలక్ట్రిక్ వెహికల్స్ బెనిఫెట్స్, అంచనాలు ఇవే..

               లాభాలు                        అంచనాలు
EV కారు రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు రోడ్లపై ప్రతి 25 కిలోమీటరుకు ఒక ఛార్జింగ్ స్టేషన్
టోల్ ఫీ నుంచి మినహాయింపు డ్రైవింగ్ రేంజ్ 140-150 కిలోమీటర్లు
EV వెహికల్ పై రోడ్ ట్యాక్స్ ఫ్రీ భవిష్యత్తులో సింగిల్ ఛార్జ్ తో 200-250 కిలోమీటర్లు
రూ.50వేలపై కొనుగొలు చేస్తే ట్యాక్స్ రిబేట్  20వేల ఛార్జింగ్ స్టేషన్లు,  సర్వీసు సెంటర్లు
ఒక యూనిట్ కు రూ.5 టారిఫ్ ఛార్జ్  ఢిల్లీలో 3వేల EV ఛార్జింగ్ స్టేషన్లు 
పార్కింగ్ ఫీ, సబ్సిడీ ఫీజు ఫ్రీ ఛాన్స్ 15వేల నుంచి 20వేల వరకు పెట్టుబడి పెట్టే యోచన