Elon Musk Bodyguards : భయంభయంగా మస్క్.. బాత్రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఉండాల్సిందే.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!
Elon Musk Bodyguards : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు భయం పట్టుకుంది. బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు. సెక్యూరిటీ, బాడీగార్డులు లేకుండా బయటకు కూడా రావడం లేదు.

Elon Musk has at least 2 bodyguards accompany him all the time at Twitter HQ, even in restroom
Elon Musk Bodyguards : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు భయం పట్టుకుంది. బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు. సెక్యూరిటీ, బాడీగార్డులు లేకుండా బయటకు కూడా రావడం లేదు. ఎక్కడికి వెళ్లినా 24/7 బాడీగార్డులు పక్కన ఉండాల్సిందే.. అది ఇప్పుడు ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ పరిస్థితి. ఎప్పుడు ఏం చేస్తాడో అతడికే తెలియదు మరి.. ట్విట్టర్‌పై ఎప్పటినుంచో కన్నేసిన మస్క్.. చివరికి తన సొంతం చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు.. ట్విట్టర్లో అనేక మార్పులు చేశాడు.
సీఈఓ స్థాయి నుంచి ఉద్యోగుల వరకు అందరిని ఇంటికి పంపేశాడు. ట్విట్టర్ ఆఫీసులను మూసేశాడు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టాడు. మస్క్ నిర్ణయాలతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మస్క్ కనిపిస్తే చాలు.. ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఉద్యోగులు. దాంతో మస్క్ గుండెల్లో గుబులు మొదలైంది. ట్విట్టర్ ఆఫీసులో కూడా భయంభయంగా ఉంటున్నాడు. ఒంటరిగా కాకుండా ఎప్పుడూ తన పక్కన సెక్యూరిటీని ఉంచుకుంటున్నాడు. బాత్ రూంకు వెళ్లినా కూడా తన వెంట ఇద్దరు బాడీగార్డులను వెంటపెట్టుకుని పోతున్నాడు. ఈ విషయాన్ని అక్కడ పనిచేసే ట్విట్టర్ ఉద్యోగి ఒకరు రివీల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Elon Musk has at least 2 bodyguards accompany him all the time at Twitter HQ, even in restroom
మస్క్లో భయాందళనకు కారణం ఇదేనా? :
ట్విట్టర్ ఉద్యోగులను తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసుల్లోని ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాడు. ఇప్పటికే ట్విట్టర్ హెడ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులనూ మస్క్ తొలగించాడు. కనీసం ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే ఉద్యోగుల తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబరులో మస్క్ తన కుటుంబ సభ్యులతో కారులో వెళుతుండగా ఒక వ్యక్తి ఫాలో అయ్యాడట.. అంతటితో ఆగలేదు.. మస్క్ కారును కూడా అడ్డగించాడు. కారు బానెట్ ఎక్కి కూర్చొని వ్యక్తి వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటినుంచి మస్క్ తన కుటుంబం భద్రత విషయంలో ఆందోళన మొదలైంది. తాను లేదా కుటుంబ సభ్యులు ఎవరూ ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ లేకుండా అడుగు బయటపెట్టడం లేదు.
Read Also : Twitter 2FA Setup : మార్చి నుంచి ట్విట్టర్ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
అప్పటినుంచి మస్క్ భయంభయంగా ఉంటున్నాడు. ట్విటర్ ఆఫీసుకి వచ్చినా కూడా మస్క్ సెక్యూరిటీ సిబ్బందితోనే కనిపిస్తున్నాడు. ఆఫీసులో కట్టుదిట్టమైన భద్రత నడుమ మస్క్ తన పనులను పూర్తి చేస్తున్నాడు. మస్క్ నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ, పర్సనల్ బాడీగార్డులను చూస్తుంటే.. అచ్చం హాలీవుడ్ సినిమాలో కనిపించే బాడీగార్డులుగా ఉన్నారు. మస్క్ బాత్ రూంకు వెళ్లినప్పుడు కూడా ఆయన వెంట ఇద్దరు బాడీగార్డులు ఫాలో అవుతారని ట్విటర్ ఆఫీసులో పనిచేసే ఇంజినీర్ ఒకరు బయటపెట్టారు. ఎందుకు మస్క్ ఇలా చేస్తున్నాడంటే.. అతడికి ఉద్యోగుల పట్ల విశ్వాసం తగ్గిందట.. ఉద్యోగుల విషయంలో తాను అభద్రతాభావంతో ఉంటున్నాడని, అందుకే ఆఫీసులో ఉన్నా తనవెంట బాడీగార్డులను వెంట తిప్పుకుంటున్నాడని ట్విట్టర్ ఉద్యోగి తెలిపారు.

Elon Musk has at least 2 bodyguards accompany him all the time at Twitter HQ, even in restroom
మస్క్ టేకోవర్ చేయడానికి ముందు ట్విట్టర్ ఆఫీసు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని, ఉద్యోగులు కూడా ప్రశాంతంగా పనిచేసేవారని ఆ ఇంజినీర్ చెప్పారు. ప్రస్తుతం ట్విట్టర్ ఆఫీసులో గందరగోళ పరిస్థితి కొనసాగుతోందని ట్విటర్ ఇంజినీర్ పేర్కొన్నారు. వాస్తవానికి ట్విట్టర్ ఆఫీసు నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోందని, లోపలికి వచ్చి చూస్తే అంతా గందరగోళంగా ఏది సక్రమంగా పనిచేయని పరిస్థితి ఉందని వాపోయారు. ఆఫీసులో చాలా వస్తువులు పనిచేయడం లేదని చెప్పారు. అందులో ప్లంబింగ్లు, కుళాయిలు అన్నీ విరిగిపోయాని ఇంజనీర్ తెలిపారు. ట్విట్టర్ ఆఫీసుల్లో ప్రస్తుతం వర్క్ ఫోర్స్ చాలా తక్కువగా ఉన్నందున, ఉద్యోగులపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఇతర టీమ్లలోని ఉద్యోగులు కూడా అదనపు టాస్క్‌లను చేయాల్సి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.