Elon Musk : అందుకే భారత్‌కు రాలేకపోతున్నా.. ఎలన్ మస్క్ ట్వీట్.. టెస్లా ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?!

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉండగా, ఇంతలోనే అనివార్య కారణాల వల్ల మస్క్ భారత పర్యటన వాయిదా పడింది.

Elon Musk : అందుకే భారత్‌కు రాలేకపోతున్నా.. ఎలన్ మస్క్ ట్వీట్.. టెస్లా ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?!

Elon Musk Postpones India Visit Due to 'Very Heavy Tesla Obligations'

Elon Musk : ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లో ఎంట్రీకి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఇండియా టూర్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అందుకు గల అసలు కారణాన్ని కూడా ట్విట్టర్ (X) వేదికగా మస్క్ రివీల్ చేశాడు.

‘దురదృష్టవశాత్తూ.. టెస్లాలో భారీ బాధ్యతల కారణంగా భారత్ పర్యటన మరింత ఆలస్యమవుతోంది. కానీ, ఈ ఏడాది చివర్లో భారత్ పర్యటన కోసం చాలా ఎదురుచూస్తున్నాను’ అని బిలియనీర్ పోస్ట్‌లో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 22 రెండు రోజులు భారత్‌‌లో మస్క్ పర్యటించాల్సి ఉంది.

Read Also : OnePlus 11R 5G Launch : సోలార్ రెడ్ వేరియంట్‌తో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉండగా, ఇంతలోనే అనివార్య కారణాల వల్ల మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. గతేడాది జూన్​లో న్యూయార్క్​లో మస్క్, మోదీ కలిశారు. ఇదే క్రమంలో భారత ఎలక్ట్రిక్​ వాహనాల దిగుమతిపై పన్నులను తగ్గించాలని టెస్లా ఎప్పటినుంచో కోరుతోంది. టెస్లా భారత్‌లో ఈవీ యూనిట్​ కోసం లోకల్ పార్టనర్ కోసం చూస్తోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్‌తో కలిసి ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈవీలపై దిగుమతి పన్నులు తగ్గించిన భారత్ :
టెస్లా కూడా చాలా ఏళ్లుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. అయితే అధిక దిగుమతి పన్నులు ఒక నిరోధకంగా మారియి. మస్క్ ఇదే అంశంపై పదేపదే ఎత్తి చూపారు. భారత్ గత నెలలో విదేశీ కార్ల తయారీదారుల నుంచి ఈవీలపై దిగుమతి పన్నులను తగ్గించింది. ఈ క్రమంలోనే కనీసం 41.5 బిలియన్ రూపాయలు (497 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాలని, మూడు సంవత్సరాలలో స్థానిక ఫ్యాక్టరీ నుంచి ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తానని కంపెనీలు హామీ ఇచ్చాయి.

భారత్‌కు టెస్లా బృందాన్ని పంపిన మస్క్ :
మరోవైపు.. ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ స్థలాల కోసం మస్క్ ఏప్రిల్‌లో భారత్‌కు ఒక బృందాన్ని పంపినట్లు నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్లోకి దాదాపు 3 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. టెస్లాను ఆకర్షించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మస్క్​ భారత్​ పర్యటన వాయిదా కారణంగా టెస్లా ప్లాంట్ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఇంక్.. అతిపెద్ద మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు మస్క్ అనుమతిని కోరుతున్నారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో దేశంలో కార్యకలాపాలు ప్రారంభించనుందని స్టార్‌లింక్ ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి హామీని పొందిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

Read Also : Redmi 13 5G Launch : భారత్‌కు కొత్త రెడ్‌మి 13 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. పోకో M7 ప్రో 5జీ పేరుతో రీబ్రాండ్ వెర్షన్..!