Elon Musk: మరోసారి భారీగా పెరిగిన ఎలాన్ మస్క్ సంపద.. 500 బిలియన్ డాలర్ల క్ల‌బ్‌లోకి..

స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ఆదాయం మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

Elon Musk: మరోసారి భారీగా పెరిగిన ఎలాన్ మస్క్ సంపద.. 500 బిలియన్ డాలర్ల క్ల‌బ్‌లోకి..

Elon Musk

Updated On : December 18, 2024 / 2:01 PM IST

Elon Musk Net Worth: స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ఆదాయం మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత మస్క్ వ్యక్తిగత సంపద భారీగా పెరుగుతోంది. స్పేస్ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ల డాలర్లు పెరిగి.. గత వారం రోజుల క్రితం 439.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరి మస్క్ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. తాజాగా మరోసారి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం.. మస్క్ వ్యక్తిగత సంపాదన మంగళవారం రికార్దు స్థాయిలో 500 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే ఒక్క వారంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 107శాతానికి పైగా పెరిగింది.

Also Read:  LIC Maturity Amount : ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్ మెచ్యూరిటీ రూ.880 కోట్లు.. ఎలా చెక్ చేయాలి? పెండింగ్ అమౌంట్ క్లెయిమ్ చేయాలంటే?

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. టెస్లా షేర్లలో అద్భుతమైన పెరుగుదల కారణంగా మస్క్ సంపద కూడా పెరిగింది. టెస్లాలో దాదాపు 13శాతం వాటాను మస్క్ కలిగి ఉన్నాడు. టెస్లా షేర్లు ఒక నెలలో 35శాతానికిపైగా పెరిగాయి. కంపెనీ 2024 ప్రాక్సీ స్టేట్ మెంట్ ను ఉటంకిస్తూ.. అతను తన 2018 పరిహారం ప్యాకేజీ నుండి దాదాపు 304 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లను మస్క్ కూడా కలిగి ఉన్నాడు. డిసెంబర్ 2024 టెండర్ ఆఫర్ లో దాదాపు దీని విలువ 350 బిలియన్ డాలర్ల విలువకు చేరింది. దీనికితోడు స్పేస్ఎక్స్ లో మస్క్ సుమారు 42శాతం వాటాను మస్క్ కలిగి ఉన్నాడు. స్పేస్ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడింది. త్వరలో ట్రంప్ బాధ్యతలు తీసుకోనుండడంతో దానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉంది.

 

ఎలాన్ మస్క్ చాలా కంపెనీలను కలిగి ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్టాకు మస్క్ సీఈవో. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ బ్యాటరీలను విక్రయిస్తుంది. అదేవిధంగా మస్క్ స్పేస్ఎక్స్ యజమాని కూడా. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందం కలిగి ఉంది. మస్క్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) యాజమాని. ఇవేకాకుండా.. మస్క్ న్యూరాలింక్, ఎక్స్ఏఐ, బోరింగ్ కంపెనీ వంటివి కూడా కలిగి ఉన్నాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్న స్టార్ లింక్ యాజమాని కూడా.