Tesla: భారత్‌కు టెస్లా కార్ల ఎగుమతి కోసం ఆ కంపెనీ ఏం చేస్తోందో తెలుసా?
ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భారత్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని..

Tesla
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌కు ఆ వాహనాలను ఎగుమతి చేయడం కోసం జర్మనీలోని తమ ప్లాంట్లో పనులు ప్రారంభించింది. ఈ రైట్ హ్యాండ్ డ్రైవ్ టెస్లా కార్లను ఈ ఏడాది చివర్లో భారత్‌లో చూడొచ్చు. టెస్లా ఏ మోడల్ కార్లను భారత్‌కు ఎగుమతి చేయాలనుకుంటుందన్న విషయంపై స్పష్టత లేదు.
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ ఉంది. భారత్‌కు కొంత కాలం పాటు టెస్లా జర్మనీ నుంచి కార్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భారత్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని యోచిస్తోంది.
భారత్‌లో 16.6 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ప్లాంటును నెలకొల్పేందుకు సైట్‌లను చూసేందుకు టెస్లా నుంచి ఒక బృందం ఈ నెలాఖరులో రానున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు భారత్ లో కనీసం 3,775 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, మూడేళ్లలోపు దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభిస్తే వాటిపై దిగుమతి పన్ను రేటును తగ్గిస్తామని ఇటీవలే భారత్ ప్రకటించింది. తక్కువ పన్నుల కోసం టెస్లా కొంత కాలంగా చర్చలు జరుపుతోంది.
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. కార్ల మార్కెట్‌గా భారీగా ఉన్న భారత్ లోకి ఆ కంపెనీ ప్రవేశిస్తే వాటి విక్రయాలు బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 40 నియో ధర తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవచ్చు!