EPFO Credit Interest : మీ అకౌంట్లో ఈపీఎఫ్ఓ వడ్డీ డబ్బులు పడ్డాయా? ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ చేసుకోండి.. ఇదిగో ప్రాసెస్!

EPFO Credit Interest : ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడ్డాయా? చూసుకున్నారా? అయితే, ఇప్పుడే మీ పీఎఫ్ అకౌంట్ చెక్ చేసుకోండి.

EPFO Credit Interest : మీ అకౌంట్లో ఈపీఎఫ్ఓ వడ్డీ డబ్బులు పడ్డాయా? ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ చేసుకోండి.. ఇదిగో ప్రాసెస్!

How to Check PF Balance Step by Step

EPFO Credit Interest : ఈపీఎఫ్ఓ చందదారులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్లలో వడ్డీ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థ ఇటీవలి ప్రకటన ప్రకారం.. అనేక మంది పీఎఫ్ ఖాతాదారులు ఇప్పటికే తమ అకౌంట్లలో వడ్డీ డబ్బులు పొందినట్టు నివేదించారు. అయితే, అన్ని అకౌంట్లలో ఈ మొత్తాలు పూర్తిగా క్రెడిట్ అయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చని ఈపీఎఫ్ఓ ​​తెలిపింది. మీ పీఎఫ్ అకౌంట్లలో కూడా వడ్డీ డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో చెక్ చేశారా? ఇప్పుడే మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అది ఎలాగో తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ వడ్డీ 24 కోట్లకు పైగా అకౌంట్లలో జమ :
నవంబర్ 1న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈపీఎఫ్‌వో 71వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఈపీఎఫ్‌ఓ 8.15 శాతం వడ్డీ ఇస్తోందని అన్నారు. పీఐబీ ప్రకటన ప్రకారం.. ఇప్పటికే 24 కోట్లకు పైగా పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ అయింది.

ఈపీఎఫ్ఓ వడ్డీ క్రెడిట్ 2022-23 : పీఎఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి? :

మీ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీని క్రెడిట్ చేసిన తర్వాత సంబంధిత మొత్తం వ్యక్తి పీఎఫ్ అకౌంట్లలో అప్‌డేట్ అవుతుంది. ఖాతాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను టెక్స్ట్ మెసేజింగ్, మిస్డ్ కాల్‌లు, (UMANG) యాప్, ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్‌తో సహా వివిధ ఛానల్‌ల ద్వారా ధృవీకరించవచ్చు.

Read Also : Update Aadhaar Card : ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

మిస్డ్ కాల్ సౌకర్యం :
యూఏఎన్ (UAN) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ఓ ​​వద్ద తమ వివరాలను పొందవచ్చు. పీఎఫ్ సభ్యుని యూఏఎన్ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్, పాన్‌లలో ఏదైనా ఒకదానితో సీడ్ అయి ఉండాలి. తద్వారా సభ్యుడు తమ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు.

యూఎమ్ఎఎన్‌జీ యాప్‌లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండి :
* ‘UMANG’ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
* యాప్‌లో ‘సెర్చ్ ఫర్ సర్వీసెస్’ విభాగంలో ‘ఈపీఎఫ్ఓ’ కోసం సెర్చ్ చేయండి.
* ‘వ్యూ పాస్‌బుక్’పై క్లిక్ చేయండి. ఆపై ‘ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసు’పై క్లిక్ చేయండి.
* మీ యూఏఎన్ వివరాలను ఎంటర్ చేయండి. మీరు ఓటీపీని పొందే లాగ్‌ఇన్ క్లిక్ చేయండి.
* మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, మీ ఈపీఎఫ్ పాస్‌బుక్‌ని చూడవచ్చు.
* మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

How to Check PF Balance Step by Step

How to Check PF Balance Step by Step

ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండి :

* ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
* హోమ్ పేజీలోనే, మీరు ఈపాస్‌బుక్ ఆప్షన్ పొందవచ్చు. దానిపై క్లిక్ చేయండి.
* మీరు యూఏఎన్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది.
* ఉద్యోగి పాస్‌బుక్‌ని చెక్ చేయాలనుకుంటున్న నిర్దిష్ట ఉద్యోగి ఐడీని ఎంచుకోవాలి.
* ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు పాస్‌బుక్‌ని చూడవచ్చు. ఆపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ :
మీ కేవైసీ వివరాలతో మీ యూఏఎన్ లింక్ చేసి ఉంటే.. మీరు 7738299899కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మాట్ ‘EPFOHO UAN‘ ఇలా ఉండాలి. మీరు భాషా కోడ్‌గా ‘ENG’ని ఉపయోగించవచ్చు. మీ భాషా ప్రాధాన్యతను బట్టి హిందీ కోసం (HIN)ని ఉపయోగించవచ్చు. మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ని చూడాలనుకుంటున్న మీ ప్రాధాన్య భాషలోని మొదటి మూడు అక్షరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Read Also : PVC Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!