EPFO ratifies interest rate
EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPFO) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్రం ఆమోదించింది.
ఈ రేటును ఈ ఏడాది ప్రారంభంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి. దాంతో పీఎఫ్ అకౌంటులో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
దాంతో దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇదివరకే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 0.10శాతం పెంచి 8.15శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
2022–23 సంవత్సరానికి వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 6, 2025 నాటికి ఈపీఎఫ్ఓ 2.16 కోట్ల ఆటో-క్లెయిమ్‌లలో పెరుగుదల కనిపించింది.
2023-24లో 89.52 లక్షలుగా ఉంది. ఈ వడ్డీ రేటు 2018–19లో 8.65 శాతం ఉండగా, 2019–20లో 8.5శాతం ఉండగా, గత రెండు ఏళ్లలో సవరణకు ముందు 2021–22లో 8.1శాతానికి తగ్గింది. 4 దశాబ్దాలలో ఇదే అత్యల్పంగా చెప్పవచ్చు.
2016-17లో 8.65 శాతం వడ్డీ రేటు ఉండగా, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో చందాదారులకు అందించింది. 2015-16లో 8.8 శాతంగా ఉంది. 2012-13లో 8.5 శాతం కన్నా ఎక్కువగా ఉంది. 2011-12 ఏడాదిలో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.
మీ EPF బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేయాలి :
ఉమాంగ్ యాప్ : ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
మీ బ్యాలెన్స్, పాస్‌బుక్ కోసం EPFO సర్వీసెస్ సెక్షన్ యాక్సెస్ చేయండి.
EPFO పోర్టల్ : ‘Member Passbook’ సెక్షన్ కింద (UAN) పాస్‌వర్డ్‌తో (www.epfindia.gov.in)కు లాగిన్ అవ్వండి.
మిస్డ్ కాల్ : మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
మీ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు అప్ డేట్ చేయండి.
మీ UANతో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.