Bank Loans : బ్యాంకు ఖాతా లేకుండా లోన్లు పొందడం ఎలా? ఆర్బీఐ రికవరీ రూల్స్ ఏంటి? ఫుల్ డిటెయిల్స్
Bank Loans : లోన్ తీసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలా? అకౌంట్ లేకుండా లోన్ తీసుకోవచ్చని మీకు తెలుసా? గోల్డ్ లోన్ల నుంచి ఇతర లోన్ యాప్ల వరకు చిన్న చిన్న రుణాలను తీసుకోవచ్చు.. అది ఎలాగంటే?
RBI Bank Loans
- బ్యాంకు లోన్లు పొందాలంటే ఖాతా కూడా తప్పనిసరిగా ఉండాలా?
- ఆర్బీఐ రికవరీ రూల్స్ ఏంటి? కస్టమర్లకు ఉన్న హక్కులేంటి?
- బ్యాంకు ఖాతా లేకుండా లోన్ తీసుకోవాలంటే? ఏం చేయాలి?
Bank Loans : మీకు లోన్ కావాలా? బ్యాంకు అకౌంట్ ఉందా? సాధారణంగా కొత్త ఇల్లు కొనాలన్నా లేదా కారు, స్టడీ వంటి ఏదైనా లోన్లు తీసుకోవడం ఈరోజుల్లో కామన్. అయితే, ముందు బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఆయా బ్యాంకులో అకౌంట్ ఉండాలని అందరూ అనుకుంటారు. బ్యాంకు ఖాతా లేకుండా లోన్లు ఇవ్వవని చెబుతుంటారు.
అందుకే చాలా మంది లోన్ కోసం అప్లయ్ చేసేందుకు సంకోచిస్తారు. బ్యాంకు ఖాతా లేకుండా లోన్ ఇవ్వడం కష్టమే కానీ, మీ ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఆధారంగా మీకు చిన్న మొత్తాల్లో లోన్లు ఇచ్చే అనేక ఫైనాన్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
ఇలా చిన్న లోన్లు తీసుకోవచ్చు :
మీకు బ్యాంకు అకౌంట్ లేకుంటే మీరు మైక్రోఫైనాన్స్ కంపెనీలు, NBFC లేదా ఫిన్టెక్ యాప్స్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సంస్థలు డిజిటల్ వ్యాలెట్ల ద్వారా నేరుగా చిన్న మొత్తాల్లో అందిస్తాయి. మైక్రోఫైనాన్స్ సంస్థల ద్వారా ఆస్తి రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రుణాలు పెద్ద మొత్తంలో ఉండవు. అలాగే వడ్డీ రేట్లు సాధారణ బ్యాంకు రుణాల కన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చు.
గోల్డ్ లోన్ :
బ్యాంకు ఖాతా లేకుండా లోన్ పొందడం చాలా ఈజీ. మీరు ఏదైనా బ్యాంకులో లేదంటే NBFCలో గోల్డ్ తాకట్టు పెట్టవచ్చు. దానిపై వచ్చే సోమ్ముతో 75 నుంచి 80 శాతం వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ లోన్లు బంగారం బరువు ఆధారంగా ఉంటాయి. వారం లేదా మీ జీతం చెల్లించే వరకు స్వల్ప కాలానికి అందిస్తారు. గోల్డ్ పూచీకత్తుగా పనిచేస్తుంది. అందుకే డాక్యముంట్ల వర్క్ చాలా తక్కువగా ఉంటుంది.
రుణగ్రహీతల చట్టపరమైన హక్కులివే :
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ కఠినమైన నిబంధనలను రూపొందించింది. బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్స్ కంపెనీ వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీల వివరాలను తప్పనిసరిగా కస్టమర్లకు తెలియజేయాలి.
ఏ రికవరీ ఏజెంట్ కూడా ఉదయం 8 గంటల ముందు లేదంటే సాయంత్రం 7 గంటల తర్వాత మిమ్మల్ని వేధించకూడదు, అలాగే అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఎలాంటి పెనాల్టీ లేకుండా లోన్ ముందుగానే తిరిగి చెల్లించే రైట్ ఉంటుంది. లోన్ తిరిగి చెల్లించిన 30 రోజులలోపు మీ ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి పొందడం మీ చట్టపరమైన హక్కు.
