వాహనదారులకు గుడ్ న్యూస్ : FASTag Free

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 10:59 PM IST
వాహనదారులకు గుడ్ న్యూస్ : FASTag Free

Updated On : February 12, 2020 / 10:59 PM IST

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టోల్ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన FASTagsను కొద్ది రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. NHA ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన ఫీజు రూ. 100ను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాఫీ చేయనున్నట్లు తెలిపింది. సరైన వాహన ధృవీకరణపత్రం (RC)తో టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సేవా కేంద్రాలు, పెట్రోల్ బంకులు, ఇతర ప్రదేశాల్లో ఫాస్టాగ్‌‌ను ఉచితంగానే పొందవచ్చని వెల్లడించింది. 

ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను మరింత పెంచే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికారణంగా వసూళ్లు బాగా పెరిగాయని చెబుతోంది. గతంలో రూ. 68 కోట్లు ఉన్న ఆదాయం..ఇప్పుడు రూ. 87 కోట్లకు చేరుకుందని వెల్లడిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తిగా ఆచరణలోకి వస్తే..నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHA) ఆదాయం వంద కోట్లు దాటుతుందని అంచనా వేస్తోంది కేంద్ర రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ. 

* దేశంలోని 527కి పైగా జాతీయ రహదారులపై FASTags విధానం తీసుకొచ్చారు. 
* 2019 డిసెంబర్ 01వ తేదీ నుంచి కోటి పైగా FASTags ట్యాగ్‌లు జారీ చేసినట్లు అంచనా. 
* ఫాస్టాగ్ సంబంధించిన సహాయం కోసం 1033 హెల్ప్ లైన్‌కు కాల్ చేయవచ్చు.

* FASTagsఉన్న తర్వాత..వాహనానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఫాస్ట్ ట్యాగ్ మొబైల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. 
* 8. ఎలక్ట్రానిక్ ట్యాగ్ లేకుండా..ఏదైనా వాహనం వస్తే..టోల్ గేట్ల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. 
* 9. FASTags పోర్టల్‌ లాగిన్ కావాలి. అక్కడ చెల్లింపు, టాప్ అప్ ఆఫ్షన్ లభిస్తుంది. రీ ఛార్జ్‌పై క్లిక్ చేసి ఆపై ఎంత డబ్బును చెల్లించాలని అనుకుంటున్నారో..వాలెట్ ఐడీని ఎంచుకోవాలి.
 

* కేవైసీ హోల్డర్ అయితే..FASTags ప్రీపెయిడ్ ఖాతాలో ఒకేసారి 10 వేలు కంటే ఎక్కువ జమ చేయడానికి అనుమతి ఉండదు.
* పూర్తి కేవైసీ ఉన్న వారికి మాత్రం లక్ష వరకు జమ చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మొదలైన వాటి ద్వారా జమ చేయవచ్చు. 
* RFID (రెడియో ప్రీకెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారంగా FASTags పనిచేస్తాయి. 

* దీని వాలెడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే..ఐదు సంవత్సరాలు బేఫికర్.
 

FASTags యాప్ :-
* FASTags కొనుగోలు చేసిన అనంతరం వాహనానికి సంబంధించిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందుకోసం FASTags యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. 
* బ్యాంకు ఖాతాకు బదులుగా డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించుకొనే స్వేచ్చ ఉంటుంది. 
* FASTags స్టిక్కర్‌ను వెహికల్ అద్దంపై అతికిస్తారు. టోల్ ప్లాజాల వద్ద వెళ్లేటప్పుడు ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు కట్ అవుతాయి. ఇందుకు వెహికల్‌ను ఆపాల్సిన అవసరం లేదు. 
 

* టోల్ ప్లాజాల వద్ద వెహికల్ వెళ్లేటప్పడు అద్దంపైనున్న ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తుంది. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. 
* అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డబ్బులు కట్ అయినట్లు SMS వస్తుంది. 
* ఉదా : మీ FASTags ఖాతాను Paytm Walletతో లింక్ చేయవచ్చు. వాహనం టోల్ ప్లాజాను దాటిన ప్రతిసారి, మీ Paytm Wallet నుంచి మొత్తం తీసివేయబడుతుంది.